TEPPOTSAVAMS IN KARVETINAGARAM FROM AUGUST 23 TO 25_ ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు

Tirupati, 21 August 2018: The annual teppotsavams will be observed in Sri Venugopala Swamy temple in Karvetinagaram from August 23 to 25.

Every day there will be Snapanam to the deities between 9am and 10.30am. Teppotsavams will be observed between 6pm and 7.30pm every day.

Meanwhile the related wall posters were released in Sri KRT in Tirupati by DyEO Smt Jhansi Rani.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

ఆగస్టు 23 నుండి 25వ తేదీ వరకు కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు

ఆగస్టు 21, తిరుపతి, 2018: కార్వేటినగరంలోని రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 23 నుంచి 25వ తేదీ వరకు తెప్పోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి.

ఈ మూడు రోజుల పాటు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారికి ఉదయం 9 నుండి 10.30 గంటల వరకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం, సాయంత్రం 6 నుండి 7.30 గంటల వరకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా మొదటిరోజు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు 3 చుట్లు, శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామివారు రెండో రోజు 5 చుట్లు, మూడో రోజు 7 చుట్లు తెప్పలపై విహరించి భక్తులకు దర్శనమిస్తారు.

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.