ANKURARPANAM PERFORMED IN SRI KRT_ శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Tirupati, 15 March 2018: The Ankurarpanam for Annual Brahmotsavams at Sri Kodanda Rama Swamy temple in Tirupati was performed on Thursday evening.
On March 16 the grand nine day religious fete will commence with Dhwajarohanam in Mesha Lagnam between 8:30am and 9am.
Lord Sri Ramachandra Murthy takes ride on Pedda Sesha Vahanam on Friday evening between 8pm and 10pm.
Temple DyEO Smt Jhansi Rani, Archaka Sri Anankumar Deekshitulu, Temple Supdt Sri Munikrishna Reddy, Temple Inspector Sri Sesha Reddy,
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
మార్చి 15, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. ముందుగా సేనాధిపతి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా స్వామివారి సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనుల వారు మాడవీధుల్లో ఊరేగింపుగా వెళ్లి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తారు. ఆ తరువాత మేదినీపూజ, మృత్సంగ్రహణం, అంకురార్పణ చేపడతారు. ఆలయంలో మార్చి 16 నుండి 24వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
మార్చి 16న ధ్వజారోహణం :
శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు మార్చి 16వ తేదీ శుక్రవారం ఉదయం 8.30 నుంచి 9 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. ఈ సందర్భంగా గరుడ ధ్వజపటాన్ని ఆరోహణం చేసి సకల దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. ఆ తరువాత ఉదయం 11 గంటలకు స్నపనతిరుమంజనం, సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ జరుగనున్నాయి. రాత్రి 8 గంటలకు పెద్దశేష వాహనసేవ ప్రారంభమవుతుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ ఉదయం సాయంత్రం
16-03-2018(శుక్రవారం) ధ్వజారోహణం పెద్దశేష వాహనం
17-03-2018(శనివారం) చిన్నశేష వాహనం హంస వాహనం
18-03-2018(ఆదివారం) సింహ వాహనం ఉగాది ఆస్థానం/ ముత్యపుపందిరి వాహనం.
19-03-2018(సోమవారం) కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
20-03-2018(మంగళవారం) పల్లకీ ఉత్సవం గరుడ వాహనం
21-03-2018(బుధవారం) హనుమంత వాహనం వసంతోత్సవం/గజ వాహనం
22-03-2018(గురువారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
23-03-2018(శుక్రవారం) రథోత్సవం అశ్వవాహనం
24-03-2018(శనివారం) పల్లకీ ఉత్సవం/చక్రస్నానం ధ్వజావరోహణం.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.