ANKURARPANAM PERFORMED IN VALMIKUPURAM RAMALAYAM_ వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

Tirupati, 22 March 2018: As the annual Brahmotsavams in Sri Pattabhirama temple at Valmikipuram are scheduled commence from March 23, Ankurarpanam was performed on Thursday evening.

The important days includes Dhwajarohanam on March 23, Hanumantha Vahanam on March 24, Kalyanotsavam and Garuda Seva on March 28, Radhotsavam on March 29 and Vasanthotsavam, Chakrasnanam and Dhwajavarohanam on March 31.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకురార్పణ

మార్చి 22, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం మూలవర్లకు అభిషేకం చేశారు. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణ కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఆలయంలో మార్చి 23 నుంచి 31వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మార్చి 23న శుక్రవారం ఉదయం 8.15 నుండి 9.05 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి.

ఈ కార్యక్రమంలో టిటిడి స్థానికాలయాల డెప్యూటీ ఈవో శ్రీ వెంకటయ్య, సూపరింటెండెంట్‌ శ్రీ చంద్రశేఖర్‌బాబు, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీ సాయి, శ్రీ నాగరాజు, శ్రీగోబ్రెనాయక్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ ఉదయం సాయంత్రం

23-03-2018(శుక్రవారం) ధ్వజారోహణం గజ వాహనం

24-03-2018(శనివారం) ముత్యపుపందిరి వాహనం హనుమంత వాహనం
25-03-2018(ఆదివారం) కల్పవృక్ష వాహనం సింహ వాహనం

26-03-2018(సోమవారం) సర్వభూపాల వాహనం పెద్దశేష వాహనం

27-03-2018(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
28-03-2018(బుధవారం) తిరుచ్చి ఉత్సవం కల్యాణోత్సవం, గరుడసేవ

29-03-2018(గురువారం) రథోత్సవం ధూళి ఉత్సవం

30-03-2018(శుక్రవారం) తిరుచ్చి ఉత్సవం అశ్వవాహనం, పార్వేటఉత్సవం

31-03-2018(శనివారం) వసంతోత్సవం/చక్రస్నానం హంస వాహనం, ధ్వజావరోహణం.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.