SRI RAMANAVAMI UTSAVAMS IN KRT_ మార్చి 25 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

Tirupati, 22 March 2018: The Sri Rama Navami Utsavams will be observed in Sri Kodanda Rama Swamy temple from March 25 onwards.

On the festival day of Sri Rama Navami, Tirumanjanam is performed to Mulavarulu and Rama Navami Asthanam in the afternoon at 3pm. While the Lord takes procession on Hanumantha Vahanam in the evening at 8pm.

On March 26, Sri Sita Rama Kalyanam will be performed and the Grihastas have to pay RS.750 on which two persons will be allowed.

On March 27, there will be Sri Rama Pattabhishekam at 7pm and on March 28, Repakula Subbamma Tototsavam is observed.

TEPPOTSAVAMS

From March 29 to 31, the annual teppotsavams will be observed in Sri Ramachandra Pushkarini between 7pm and 8:30pm. On first day the deities will take five rounds in pushkarini on the finely decked float, seven rounds on second day and nine rounds on the last day.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 25 నుండి శ్రీ కోదండరామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు

మార్చి 22, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మార్చి 25వ తేదీ నుండి శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఇందులో భాగంగా మొదటిరోజు ఉదయం శ్రీరామనవమి సందర్భంగా మూలవర్ల తిరుమంజనం, మధ్యాహ్నం 3 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం వైభవంగా జరుగనుంది. రాత్రి 8 గంటలకు హనుమంత వాహనంపై రాములవారు ఆలయ మాడ వీధుల్లో విహరిస్తారు.

మార్చి 26న శ్రీ సీతారాముల కల్యాణం :

మార్చి 26వ తేదీ సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం వేడుకగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణంలో పాల్గొనవచ్చు. వీరికి ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ ప్రసాదం బహుమానంగా అందజేస్తారు. ఆ తరువాత తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు. మార్చి 27న ఉదయం స్వామివారికి చతుర్దశ కలశ స్నపనతిరుమంజనం, సాయంత్రం 7 గంటలకు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. మార్చి 28వ తేదీన రేపాకుల సుబ్బమ్మ తోట ఉత్సవం జరుగనుంది.

మార్చి 29 నుండి 31వ తేదీ వరకు తెప్పోత్సవాలు :

శ్రీకోదండరాముని తెప్పోత్సవాలు మార్చి 29 నుండి 31వ తేదీ వరకు ప్రతిరోజు రాత్రి 7 నుడి 8.30 గంటల వరకు శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజూ ఉదయం 8 నుండి10 గంటల వరకు స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మొదటిరోజు ఐదు చుట్లు, రెండో రోజు ఏడు చుట్లు, చివరిరోజు తొమ్మిది చుట్లు తెప్పలపై స్వామివారు విహరిస్తారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.