ANKURARPANAM-THE SEED SOWING FESTIVAL BASE FOR MEGA RITUAL_శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రత్యేకవ్యాసం

Tiruchanoor, December 2, 2018:Ankurarpanam for the annual Brahmotsavam of Sri Padmavathi Ammavari Temple is a festival of prelude that is being observed on a day before Navahnika brahmotsavams.

COLLECTING SOIL AND SOWING NINE TYPEA OF GRAINS

In this ritual, holy soil is collected in nine mud pots and this ritual is known as Mritsanrahanam which acts as a significant episode in the Ankurarpanam event. This is often performed in the north-east direction in the Friday Gardens of the Ammavari temple.

Later prayers are offered to Sri Bhuvarahaswamy followed by Gayatri Anusthanam and Bhusukta Parayanam are rendered and Baliharanam is performed where in Rice mixed with Til is offered.

That sacred spot is cleaned with the urine and dung of desi Cow and then red soil from snake pits are taken to the Yagashala where the Nava dhanyas are sown.

Later Nivedana, Baliharanam, Nirajanam, Mantra pushpam, and prasadam are rendered.

It is believed that the metre of success is ranged with the efficiency levels of the growth of seeds in the mid pots during these nine days of brahmotsavams.

Akahanda Deeparadhana: At the Yagashala Akhandha Deeparadhana is performed where in ghee lamp is lit and ensured that it persists during these nine days without litting off the light. Both Ankurarpanam and Akhanda Deeparadhana are considered to be two most important rituals that indicates the grand successful conduct of the mega event.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల ప్రత్యేకవ్యాసం

అంకురార్పణ వైశిష్ట్యం

డిసెంబ‌రు 02, తిరుపతి, 2018: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ కార్తీక బ్రహ్మోత్సవాలు డిసెంబ‌రు 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం డిసెంబ‌రు 3వ తేదీ సోమ‌వారం సాయంత్రం 6 నుంచి 8.30 గంటల వరకు సేనాధిప‌తి ఉత్స‌వం, శాస్త్రోక్తంగా అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఉదయం 8 నుండి 12 గంట‌ల వ‌ర‌కు లక్షకుంకుమార్చన వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఘట్టాల విశేషాలను తెలుసుకుందాం.

అంకురార్పణ ఘట్టంలో ముందుగా భగవంతుని అనుజ్ఞ తీసుకుని షోడషోపచారాలు సమర్పిస్తారు. సమస్తమైన విఘ్నాలు తొలగేందుకు విష్వక్సేనారాధన నిర్వహిస్తారు. ఆ తరువాత స్థల శుద్ధి, ద్రవ్యశుద్ధి, శరీర శుద్ధి, ఆత్మశుద్ధి కోసం పుణ్యహవచనం చేపడతారు. పుణ్యమైన మంత్రాలను పఠించి కలశంలోని నీటిని శుద్ధి చేయడాన్ని పుణ్యహవచనం అంటారు. సభాపూజలో భాగంగా భగవంతునికి సాష్టాంగ ప్రమాణం సమర్పించి అనుజ్ఞ తీసుకుంటారు. యాగశాలలో ఎవరెవరు ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయాన్ని రుత్విక్‌వరణంలో వివరిస్తారు.

అంకురార్పణ కార్యక్రమంలో ప్రధాన ఘట్టం మృత్సంగ్రహణం. అమ్మవారి ఆలయం వద్దగల శుక్రవారపు తోటలో ఈశాన్య దిశలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ముందుగా శ్రీభూవరాహస్వామివారిని ప్రార్థించి, గాయత్రి అనుష్టానం, భూసూక్తం పారాయణం చేస్తారు. ధూపదీప నైవేద్యం సమర్పించి మాషాచోప(మినుముల అన్నం) బలిహరణ చేస్తారు. ఆ ప్రాంతాన్ని గోమూత్రం, గోమేయంతో శుద్ధి చేసి భూమాతను ఆవాహన చేసి వస్త్రసమర్పణగావిస్తారు. భూమాత ఉధ్వాసన అనంతరం పుట్టమన్ను తీసుకుని ఆలయానికి వేంచేపు చేస్తారు. యాగశాలలో వాస్తుదోష నివారణ కోసం హవనం నిర్వహిస్తారు. ఆ తరువాత పాలికల్లో మట్టిని, నవధాన్యాలను ఉంచి పసుపునీళ్లు చల్లి బీజవాపనం చేస్తారు. అనంతరం నివేదన, బలిహరణ, నీరాజనం, మంత్రపుష్పం, తీర్థప్రసాద గోష్టి నిర్వహిస్తారు.

అఖండ దీపారాధన :

యాగశాలలో అంకురార్పణ సందర్భంగా అఖండదీపారాధన చేస్తారు. బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు ఈ దీపం వెలుగుతూనే ఉంటుంది. అనంతరం ఈ దీపాన్ని గర్భాలయంలో గల దీపంలో ఐక్యం చేస్తారు.

అంకురార్పణ ఘట్టానికి వైఖానసం, పాంచరాత్ర ఆగమాల్లో విశేష ప్రాధాన్యం ఉందని, ఇవి భగవంతునికి రెండు కళ్లు లాంటివని పండితులు చెబుతున్నారు. వైఖానసంలో మంత్రభాగాన్ని ప్రధానంగా తీసుకుని విష్ణువును అర్చిస్తారు. పాంచరాత్రంలో మంత్రం, తంత్రం, క్రియ, ముద్రలు ప్రధానంగా ఉంటాయి.

లక్ష కుంకుమార్చన :

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సోమ‌వారం ఉదయం 8 నుంచి 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన సేవ జరుగనుంది. దాదాపు 11 సంవత్సరాల క్రితం లక్ష కుంకుమార్చన సేవను ప్రవేశపెట్టారు. ఇందులో అమ్మవారి సహస్రనామాన్ని 10 సార్లు 20 మంది అర్చకస్వాములతో ప్రార్థన చేస్తారు. అమ్మవారు మంచి శక్తితో ఉండి పది రోజుల పాటు బ్రహ్మోత్సవాల్లో భక్తులందరికీ పరిపూర్ణమైన కృపాకటాక్షాలు అందించాలని కోరుతారు. లక్ష కుంకుమార్చనలో పాల్గొనే భక్తులకు శక్తి, ముక్తి, భక్తి కలుగుతాయ‌ని అర్చకులు తెలిపారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.