ANNAMAIAH JAYANTHI CELEBRATED _ ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

Tirupati, 29 April 2018: The 610th Tallapaka Annamacharya Jayanthi was observed in Tirupati on Sunday.

About 50 artistes from Annamacharya Project of TTD performed Annamaiah Sapthagiri Sankeertana Gosti Ganam followed by Harikatha Parayanam by Smt Savitri Bhagavtarini.

In the evening spiritual scholar Smt Kondaviti Jyotirmayee will render Annamacharya kritis followed by dance performance by Sri Krishna Natyalaya troupe from Chennai.

While in Mahati the students of SV College of Music and Dance will perform musical concert.

Project Director Sri Dhananjeyulu, Project Research Assistant Dr C Lata were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఘనంగా శ్రీ తాళ్లపాక అన్నమయ్య 610వ జయంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2018 ఏప్రిల్ 29: కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవేంకటేశ్వరస్వామివారి తత్త్వాన్ని లోకానికి చాటిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 610వ జయంతి ఉత్సవాలు ఆదివారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఉదయం 9.00 నుండి 10.00 గంటల వరకు సుమారు 50 మంది అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహించారు. “కొండలలో నెలకొన్న…..నారాయణతే నమో నమో…..ముద్దుగారే యశోధ…..వేదములే నీ నివాస…” కీర్తనలను ఆలపించారు.

మధ్యాహ్నం 1.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీమతి జయంతి సావిత్రి భాగవతార్‌ అన్నమయ్య జీవిత చరిత్రపై హరికథ పారాయణం చేశారు.

సాయంత్రం 6.00 నుండి 7.30 గం.ల వరకు శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి , వారి బృందంచే గాత్ర సంగీతం జరుగనుంది. రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు చెన్నైకి చెందిన శ్రీకృష్ణ నాట్యాలయ బృందంచే నృత్య కార్యక్రమం జరుగనుంది.

మహతి కళాక్షేత్రంలో :

తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో గురువారం సాయంత్రం 6.00 నుండి 8.00 గంటల వరకు టిటిడి శ్రీ వేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల బృందంచే గాత్ర సంగీత కార్యక్రమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో తితిదే ప్రాజెక్టుల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ ధనుంజయులు, అన్నమాచార్య ప్రాజెక్టు రీసెర్చి అసిస్టెంట్‌ డా||సి.లత ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.