GODDESS PADMAVATHI TAKES RIDE ON SWARA RADHAM_ స్వర్ణరథంపై మెరిసిన శ్రీ పద్మావతి అమ్మవారు

Tiruchanoor, 29 April 2018: As a part of the ongoing three day annual Vasanthotsavams in Tiruchanoor, Goddess Padmavathi Devi took celestial ride on Swarnaratham on Sunday.

Seated majestically on Swarnaratham, the Goddess took celestial ride on the golden chariot. As the rays of the Sun fell on the Ratham, it enhanced the shine of the Golden chariot.

Later in the afternoon Snapana Tirumanjanam was performed in Friday Gardens.

TTD Trust Board member Sri Peddireddi, Temple DyEO Spl.Gr.DyEO Sri Munirathnam Reddy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

స్వర్ణరథంపై మెరిసిన శ్రీ పద్మావతి అమ్మవారు

తిరుపతి, 2018 ఏప్రిల్ 29: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం స్వర్ణరథంపై అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. 

ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం ఉత్సవర్లను ఊరేగింపుగా స్వర్ణరథం మంటపానికి తీసుకొచ్చారు. ఉదయం 7.30 గంటలకు స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. బంగారు రథాన్ని అధిరోహించిన అమ్మవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. 

మధ్యాహ్నం 2.00 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. అనంతరం అక్కడ స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6.30 నుండి 7.30 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించనున్నారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తలమండలి సభ్యులు శ్రీ ఇ.పెద్దిరెడ్డి,ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఆలయ ఎఈవో శ్రీ సుబ్ర‌మ‌ణ్యం,ఏవీఎస్వో శ్రీ పార్థసారథి రెడ్డి , ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.