ANNAMACHARYA SANKEERTANS ENTHRALLS _ “సొగసు చూడతరమా…. ” పులకించిన అన్నమాచార్య కళామందిరం

Tirupati, 25 May 2024: As part of the 616th birth anniversary celebrations of Sri Thallapaka Annamacharya, the musical night enthralled the audience with notable Sankeertans.

Some renowned numbers like Srimannarayana….., Ananda Sagaram meede Nee Deham…., Deva Devam Bhaje rendered by Smt Manda Sudharani and her troupe from Visakhapatnam impressed the Musical lovers of Tirupati who thronged Annamacharya Kalamandiram on Saturday evening.

Annamacharya Project Director Dr. Vibhishana Sharma, VGO Sri. Balireddy, Program Assistant Smt. Kokila and others participated in this program.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

“సొగసు చూడతరమా…. ” పులకించిన అన్నమాచార్య కళామందిరం

తిరుపతి, 2024 మే 25: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం జరిగిన సంగీత కార్యక్రమంతో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం పులకించింది.

ఈ సందర్భంగా విశాఖపట్నంకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీమతి మండ సుధారాణి బృందం ” శ్రీమన్నారాయణ….., ఆనంద సాగరం మీద నీ దేహం…., దేవ దేవం భజే దివ్య ప్రభావం…” వంటి అన్నమయ్య సంకీర్తనలను సుమధురంగా ఆలపించినారు. అన్నమయ్య సంకీర్తనాలాపనతో పురప్రజలు తన్మయత్వం చెందారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ విభీషణ శర్మ, విజిఓ శ్రీ బాలిరెడ్డి, ప్రోగ్రాం అసిస్టెంట్ శ్రీమతి కోకిల తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.