515TH ARADHANOTSAVAM OF ANNAMACHARYA ON MARCH 14_ మార్చి 14న తిరుమలలో 515వ అన్నమయ్య వర్థంతి ఉత్సవం
Tirupati, 5 March 2018: The 515th Aradhana Mahotsavam of saint Poet Sri Tallapaka Annamacharya will be observed on March 14.
As a part of the event Sri Malayappaswamy along with his consorts will come in a procession to Narayanagiri gardens where the artistes of Annamacharya project will render Sankeertana Goshtiganam. Later on the utsava deities will be brought back to Srivari temple. This spiritual programme takes place between 6pm and 8am.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
మార్చి 14న తిరుమలలో 515వ అన్నమయ్య వర్థంతి ఉత్సవం
మార్చి 05, తిరుమల 2018: పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యల 515వ వర్థంతి మహొత్సవం ఈనెల 14న పాల్గున మాసంలో బహుళ ద్వాదశినాడు తిరుమలలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది.
ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా బయల్దేరి సాయంత్రం 6.00 గంటలకు నారాయణగిరి ఉద్యానవనాలకు చేరుకుంటారు. అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం నిర్వహించనున్నారు. అటు తరువాత స్వామివారు ఉభయదేవేరులతో కూడి ఆలయానికి వేంచేపు చేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.