UGADI ASTHANAM IN SRIVARI TEMPLE ON MARCH 18_ మార్చి 18న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

Tirumala, 5 March 2018: Elaborate arrangements are underway to observe the Telugu New Year- Vilambinama Ugadi festival in the Srivari temple at Tirumala on March 18.

On the festival after daily ritual of Suprabatham and Shuddi, TomalaSeva, Panchanga sravanam is performed at Bangaru Vakili inside the temple.

Both the Mula Virat and Utsava idols will be decorated with new clothes followed by Panchanga Sravanam which forms the core part during Ugadi Asthanam.

In view of Ugadi festival, TTD has cancelled all Arjitha sevas including Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam on the day.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 18న తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

మార్చి 05, తిరుమల 2018: మార్చి 18వ తేదీ ఆదివారం తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ విళంబినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది.

ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా ఉదయం 3.00 గంటలకు సుప్రభాతం, నిర్వహించి అనంతరం శుద్థిని నిర్వహిస్తారు. అటు తరువాత తోమాలసేవను ఏకాంతంగా నిర్వహించిన అనంతరం బంగారు వాకిలి చెంత పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగనుంది.

ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి ససేత శ్రీ మలయప్పస్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణను నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్థంభం చుట్టు ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. అటు తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణ కార్యక్రమం వీనులవిందుగా నిర్వహించనున్నారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలిలో ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఉన్నతాధికారులు మరియు సిబ్బంది పాల్గొంటారు.

ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని మార్చి 18వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.