ANNAMAIAH CD RELEASED_ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా అన్నమయ్య సంకీర్తనల సిడిల ఆవిష్కరణ

Tirupati, 4 September 2017: Twin CDs of Annamaiah Sankeertans including “Annamaiah Sankeertana Mukthavali” and “Annamaiah Pushpalathika” were released in Annamacharya Kalamandiram on Monday in connection with Sravana Nakshatram.

These keertans in these two CDs were composed and sung by renowned artistes of Annamcharya Project Dr G Balakrishna Prasad(retired) and Smt R Bullemma. After the CD release, the artistes presented some songs and enthralled the audience.

SV Audio Recording Project Special Officer Sri Munirathnam Reddy was also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా అన్నమయ్య సంకీర్తనల సిడిల ఆవిష్కరణ

సెప్టెంబరు 04, తిరుపతి, 2017: శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం సాయంత్రం రెండు అన్నమయ్య సంకీర్తనల సిడిలను టిటిడి ఎస్‌.వి.రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

”అన్నమయ్య సంకీర్తన ముఖావళి, అన్నమయ్య సంకీర్తన పుష్పలతిక” పేరిట రెండు సిడిలను టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో రూపొందించారు. ఈ సిడిల్లోని కీర్తనలను ప్రముఖ గాయకులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్‌, శ్రీమతి ఆర్‌.బుల్లెమ్మ స్వరపరిచి గానం చేశారు. అనంతరం ఈ సిడిల్లోని కీర్తనలను వీరిరువురు అద్భుతంగా ఆలపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని టిటిడి కల్పించింది.

ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.క ష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.