PAVITROTSAVAMS COMMENCE IN SRI PAT_ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా పవిత్ర ప్రతిష్ఠ

Tirupati, 4 September 2017: The three-day annual pavitrotsvams commenced in Sri Padmavathi Ammavaru temple at Tiruchanoor on Monday. After performing Snapana Tirumanjanam to the utsvamurthy of Goddess, the Pavitra Pratishta was made as per the tenets of Pancharatra Agama. The temple authorities have cancelled Kalyanotsavam, Unjal Seva and Astadala Pada Padmaradhana in connection with this festival.

Usually these Pavitrotsavams are observed to free from the sins committed either knowingly or unknowingly by the temple priests while performing sevas to the deity.

Temple Spl Gr DyEO Sri Munirathanam Reddy, AEO Sri Radhakrishna,Temple Staff and others were present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా పవిత్ర ప్రతిష్ఠ

సెప్టెంబరు 04, తిరుపతి, 2017 : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరుగనున్న పవిత్రోత్సవాల్లో భాగంగా సోమవారం పవిత్ర ప్రతిష్ఠ ఘనంగా జరిగింది.

ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన చేపట్టారు. ఆ తరువాత ద్వారతోరణ, ధ్వజకుంభ ఆవాహనం, చక్రాదిమండల పూజ, చతుష్టానార్చన, అగ్నిప్రతిష్ఠ, హోమం, పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. మధ్యాహ్నం శ్రీపద్మావతి అమ్మవారికి స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు ఇతర సుగంధద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ కారణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, అష్టదళపాదపద్మారాధన సేవలు రద్దయ్యాయి.

ఈ సందర్భంగా ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ ఒక్కొక్కరు రూ.750/- చెల్లించి ఈ పవిత్రోత్సవాల ఆర్జిత సేవలో పాల్గొనవచ్చన్నారు. 2 లడ్డూలు, 2 వడలు బహుమానంగా అందజేస్తామన్నారు. సెప్టెంబరు 5న పవిత్ర సమర్పణ రోజున కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, సెప్టెంబరు 6న పూర్ణాహుతి కారణంగా కల్యాణోత్సవం, అష్టోత్తర శతకలశాభిషేకం, ఊంజల్‌సేవలను రద్దు చేసినట్టు ఆయన తెలిపారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.