ANNAMAIAH CDs LAUNCHED_ అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా అన్నమయ్య సంకీర్తనల ఆవిష్కరణ

Tirupati, 01 July 2018: Two more CDs on Annamaiah Sankeertanalu were launched on Sunday evening at Annamacharya Kalamandiram in Tirupati.

The first one being Annamaiah Venkatesuni Mahimalu composed by Sri P R Ramanathan and sung by Smt Ramanavani, Smt Lakshmirajyam and Sri M B Lokanatha Reddy while the second CD titled “Annamaiah Hari Karuna” sung by Sri B Raghunath of Annamacharya Project.

Every month the CDs were released on the auspicious day of Shravana Nakshatra.

Special Grade DyEO Sri P Munirathnam Reddy, Sri Vengamamba Project Co-ordinator Dr KJ Krishnamurthy were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా అన్నమయ్య సంకీర్తనల ఆవిష్కరణ

జూలై 01, తిరుపతి, 2018:శ్రీవారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం సాయంత్రం రెండు అన్నమయ్య సంకీర్తనల సిడిలను టిటిడి ఎస్‌.వి.రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

”అన్నమయ్య శ్రీ వేంకటేశుని మహిమలు” సిడిలోని సంకీర్తనలను శ్రీ పిఆర్.రామనాథన్ స్వరపరచగా శ్రీమతి పి.రమణవాణి, కుమారి లక్ష్మీరాజ్యం, శ్రీ ఎం.బి.లోకనాథరెడ్డి గానం చేశారు. ”అన్నమయ్య హరికరుణ” సిడిలోని కీర్తనలను శ్రీ బి.రఘునాథ్ స్వరపరిచి శ్రీమతి శ్రీనిధితో కలిసి ఆలపించారు. అనంతరం ఈ సిడిల్లోని కీర్తనలను కళాకారులు రసరమ్యంగా ఆలపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే సౌకర్యాన్ని టిటిడి కల్పించింది.

ఈ కార్యక్రమంలో తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టిటిడి. ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.