CHAKRASNANAM MARKS CONCLUSION OF ANNUAL BTUs in APPALAYAGUNTA_ వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

Appalayagunta, 1 July 2018: With the celestial Chakra Snanam on Sunday morning, curtains came down to the annual brahmotsavams at Appalayagunta.

Earlier, the processional deities and Sudarshana Chakrattalwar were rendered Snapana Tirumanjanam followed by holy dip, Chakrasnanam to Chakrattalwar.

In the evening, Dhwajavarohanam will be observed, where the traditional Garuda flag, hoisted on the temple pillar on the first day will be lowered amidst chanting of veda mantras marking the successful completion of the nine-day brahmotsavams.

Temple Special Grade DyEO Sri Munirathnam Reddy, AEO Sri Subrahmanyam, Superintendent Sri Gopala krishna Reddy took part in the fete.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

వైభవంగా శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి చక్రస్నానం

తిరుపతి, 2018 జూలై 01: అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన ఆదివారం ఉదయం చక్రస్నానం వైభవంగా జరిగింది. ముందుగా ఉదయం 7.30 నుండి 8.30 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు పల్లకీ ఉత్సవం నిర్వహించారు. ఉదయం 8.45 నుండి 10.15 గంటల వరకు పుష్కరిణి ఎదురుగా స్నపనతిరుమంజనం చేపట్టారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో అభిషేకం చేశారు. అనంతరం పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. అర్చకులు, అధికారులు, భక్తులు పెద్ద ఎత్తున స్నానాలు ఆచరించారు.

ఈ సందర్భంగా టిటిడి ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీ మునిరత్నంరెడ్డి మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల విజయవంతానికి కృషి చేసిన అన్ని విభాగాల అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

రాత్రి 7 నుండి 7.30 గంటల మధ్య ధ్వజావరోహణం జరుగనుంది. అనంతరం తిరుచ్చి ఉత్సవం జరుగనుంది. ధ్వజావరోహణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

కాగా బ్రహ్మోత్సవాల్లో చేపట్టిన విద్యుద్దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ చేశారు. రోజుకు 200 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఏఈవో శ్రీ సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ శ్రీ గోపాలకృష్ణ, ఆలయ కంకణభట్టార్‌ శ్రీ సూర్యకుమార్‌ ఆచార్యులు, ఎవిఎస్‌వో శ్రీ పార్థసారధిరెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ శ్రీనివాసులు, ఇతర ఆధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.