ANNAMAIAH CDs ON SALES _ సరసమైన ధరలకు అన్నమయ్య సంకీర్తనల సిడిలు, డివిడిలు

Tirupati, 25 October 2017: The music lovers has a good news as TTD is marketing the CDs of Saint Poet Annamacharya Sankeertans at Annamacharya Kalamandiram till October 30 from 4pm to 9pm.

The Harikatha Sapthaham is already under way in this famous auditorium. The CDs including Annamaiah Sankeertana Sravani, Annamaiah Sankeertana Yagnam, Annmaiah Sankeertana Trisati are also available for sales.

The denizens can make use of this facility.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

సరసమైన ధరలకు అన్నమయ్య సంకీర్తనల సిడిలు, డివిడిలు

అక్టోబరు 25, తిరుపతి, 2017: పదకవితా పితామహుడు, శ్రీవారి పరమభక్తుడు అయిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనల సిడిలు, డివిడిలను సరసమైన ధరలకు భక్తులకు అందుబాటులో ఉంచడమైనది. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో హరికథ ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భక్తుల కోసం టిటిడి ప్రచురణల విక్రయ విభాగం ఆధ్వర్యంలో సిడిలు, డివిడిలు, పుస్తకాలతో ఒక స్టాల్‌ను ఏర్పాటుచేశారు. అక్టోబరు 30వ తేదీ వరకు ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ స్టాల్‌ తెరిచి ఉంటుంది.

ఇందులో ప్రముఖ సంగీత విద్వాంసులు ఆలపించిన ”అన్నమయ్య సంకీర్తనా యజ్ఞం”, ”అన్నమయ్య సంకీర్తన శ్రావణి”, ”అన్నమయ్య 600 సంకీర్తనలు” తదితర సిడిలు, డివిడిలు ఉన్నాయి. అదేవిధంగా, రామాయణం, భాగవతం, అన్నమయ్య సంకీర్తన త్రిశతి, అన్నమయ్య సంకీర్తనామృతం, అన్నమయ్య స్వరమాలిక, ఆనందనిలయం, స్థానికాలయాల చరిత్రను తెలియజేసే పుస్తకాలు ఉన్నాయి. భక్తులు ఈ స్టాల్‌ను సందర్శించి సిడిలు, డివిడిలు, పుస్తకాలను కొనుగోలుచేసి ఆధ్యాత్మికానందాన్ని పొందగలరని కోరడమైనది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.