CVSO REVIEWS SRI PAT BTU ARRANGEMENTS_ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు – టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ

Tirupati, 25 October 2017: As the annual Karthika Brahmotavams of Tiruchanoor are scheduled from November 15 to 23, CVSO Sri A Ravikrishna reviewed the security arrangements for the upcoming event in his chambers in TTD Administrative building at Tirupati on Wednesday.

He said, there should not be any compromise on security arrangements especially on the day of Panchami Teertham. The parking, traffic regulation etc. need to be executed in an effective manner keeping in view the past experience.

The top cop of TTD also said, as it is the Karthika Month where there is heavy turnout of devotees, security need to be beefed up in the sub-shrines of TTD also.

ACVSO Sri Sivakumar Reddy, VGOs Sri Ravindra Reddy, Smt Sada Lakshmi, AVSOs Sri Parthasaradhi Reddy, Sri Gangaraju were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు – టిటిడి సివిఎస్వో శ్రీ ఆకే.రవికృష్ణ

తిరుపతి, 2017 అక్టోబరు 25: సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవంబరు 15 నుండి 23వ తేదీ వరకు జరగనున్న నేపధ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని టిటిడి ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ ఆకే.రవికృష్ణ అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలో గల సివిఎస్వో కార్యాలయంలో బుధవారం భద్రతా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సివిఎస్వో మాట్లాడుతూ శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో గత అనుభవాల దృష్ట్యా వాహనసేవలు, క్యూలైన్లలో భక్తులకు మరింత మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక పోలీసుల సమన్వయంతో పవిత్ర పంచమితీర్థం రోజున తిరుచానూరుకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు అవసరమైన భద్రతాఏర్పాట్లు చేపట్టనున్నట్లు వివరించారు. పంచమితీర్థం రోజున అమ్మవారి పుష్కరిణి వద్ద ఎలాంటి తోపులాటలు లేకుండా గెేట్లను, క్యూలైన్లను టిటిడి భద్రతా, పోలీస్‌ అధికారులు ముందస్తుగా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. పార్కింగ్‌, ట్రాఫిక్‌, తదితర విషయాలను చర్చించి పలు సూచనలు చేశారు. అదేవిధంగా పవిత్రమైన కార్తీకమాసంలో టిటిడి అనుబంధ ఆలయాల్లో భక్తుల రద్ధీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విజివోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మీ, డెప్యూటీ ఈఈ శ్రీ రాధాకృష్ణ, ఎవిఎస్వోలు శ్రీ పార్థసారధిరెడ్డి, శ్రీ గంగరాజు, ఎస్‌పిఎఫ్‌ భద్రతా అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.