ANNAMAIAH CDs RELEASED_ ”అన్నమయ్య వేంకటేశ కృప” సంకీర్తనల సిడి ఆవిష్కరణ

Tirupati, 4 February 2019: On the occasion of Sravana Nakshatra, the birth star of Lord Venkateswara, Annamaiah CDs were released in Annamacharya Kalamandiram at Tirupati on Monday evening.

Annamaiah Venkatesa Krupa CD was released with songs sung by Sri K Ramachari and Chi.Yasasvi Nandapareekh. Later they rendered the songs and enthralled the audience.

SV Recording Project Special Officer Sri P Munirathnam Reddy was also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

”అన్నమయ్య వేంకటేశ కృప” సంకీర్తనల సిడి ఆవిష్కరణ

తిరుపతి, 2019 ఫిబ్రవరి 04: శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని సోమవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య వేంకటేశ కృప” సంకీర్తనల సిడిని ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఆవిష్కరించారు.

టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ సంకీర్తనలను రికార్డు చేశారు. ”అన్నమయ్య వేంకటేశ కృప” సంకీర్తనలను శ్రీ కె.రామాచారి స్వరపరచగా చిరంజీవి శ్రీ యశస్వి నందపరీక్‌ గానం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ కె.రామాచారిని, శ్రీ యశస్వి నందపరీక్‌ను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం వారు ఈ సంకీర్తనలను పాడి వినిపించారు.

ఈ సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.