TIRUMALA HILLS REVERBERATES TO DASA PADAS_ నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో మైమ‌ర‌పించిన దాసప‌దాల‌ సంకీర్త‌నాగానం

Tirumala 4 February 2019: The hill town of Tirumala reverberated to the thousands of voices which sung melodious notes of Dasa Sankeertans on Monday evening.

During the Unjal seva of deities held in Narayana giri Gardens of Tirumala on the occasion of Sri Purandhara Dasa Aradhanotsavams, the Dasaparas who hailed from AP, TS, TN, Karnataka and Maharashtra in thousands sang all the songs in union with which the entire premises echoed.

Later Puttige mutt seer Sri Sugunendra Theertha Swami rendered Anugraha Bhashanam.

Board member Smt Sudha Narayana murthy, Temple DyEO Sri Harindranath, Dasa Sahitya Project Special Officer Sri Anandatheerthacharyulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

నారాయ‌ణ‌గిరి ఉద్యాన‌వ‌నాల్లో మైమ‌ర‌పించిన దాసప‌దాల‌ సంకీర్త‌నాగానం

తిరుమల, 2019, ఫిబ్ర‌వ‌రి 04: తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు సోమ‌వారం సాయంత్రం శ్రీ పురందరదాసులవారి కీర్తనలతో మారుమోగాయి. శ్రీ పురందరదాసులవారి ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఈ సంద‌ర్భంగా చల్లటి సాయంత్రం వేళ నిర్వ‌హించిన ఊంజ‌ల్‌సేవ‌లో దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపింపచేసింది.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురందరదాస కృతులను ఆలపించారు. ఇందులో గురుపురందర దాసరే…., లక్ష్మి బారమ్మ…, నంద నందన బారో…, నారాయణ గోవింద జయ జయ…., హరినారాయణ…. తదితర కీర్తనలు భక్తి సాగరంలో ముంచెత్తాయి.

అనంతరం ఉడుపి పుత్తిగె మ‌ఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర‌తీర్థ స్వామీజీ మంగ‌ళాశాస‌నాలు అందించారు. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఆశ్రయించడమే కలియుగంలో మోక్షసాధనకు మార్గమ‌న్నారు. పురందరదాస కీర్తనలు భక్తిని విశేషంగా వ్యాప్తి చేస్తున్నాయని తెలిపారు. భగవంతుని నామసంకీర్తన కలియుగంలో అత్యంత ఉత్కృష్టమైన భక్తి మార్గమని చాటి చెప్పారు. స్వామివారిని శరణాగత భక్తితో కొలిస్తే తప్పక కరుణిస్తాడని చెప్పారు. పురందరదాసులవారు అమితమైన భక్తితో స్వామివారిపై అనేక కీర్తనలు రచించారని తెలియజేశారు. భజన మండళ్ల సభ్యులు పురందరదాస కీర్తనల ద్వారా శ్రీవారి వైభవాన్ని వ్యాప్తి చేయాలని కోరారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు శ్రీమతి సుధా నారాయణమూర్తి, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పేష్కార్ శ్రీ రమేష్ బాబు, విఎస్ఓ శ్రీ మ‌నోహ‌ర్, ఎవిఎస్వో శ్రీ గంగరాజు ఇతర అధికారులు, 3000 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.