ANNAMAIAH CDs TO BE RELEASED ON JULY 11_ జూలై 11న అన్నమయ్య సంకీర్తనల సిడిలు ఆవిష్కరణ

Tirupati, 10 July 2017: In connection with Sravana Nakshatram on July 11, a new series of Annamaiah CDs will be released at Annamacharya Kalamandiram on Tuesday evening.

The CDs includes Annamaiah Sringara Vaibhavam and Annamaiah Madhura Sringaram which are recorded in SV Recording Project. The first one was sung by Dr K Vandana while the second CD was composed by Dr C Prabhavati and the songs were rendered by Smt B Chinnama Devi and Sri K Kalyana Rao.

Project Special Officer Sri P Munirathnam REddy is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
జూలై 11న అన్నమయ్య సంకీర్తనల సిడిలు ఆవిష్కరణ

తిరుపతి, 2017, జూలై 10: శ్రీవేంకటేశ్వరస్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని జూలై 11వ తేదీ మంగళవారం సాయంత్రం 6 గంటలకు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తనల సిడిల ఆవిష్కరణ కార్యక్రమం జరుగనుంది.

”అన్నమయ్య శృంగార వైభవనం”, ”అన్నమయ్య మధుర శృంగారం” సిడిలను ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. ”అన్నమయ్య శృంగార వైభవనం” సిడిలోని సంకీర్తనలను డా. కె. వందన గానం చేశారు. ”అన్నమయ్య మధుర శృంగారం” సిడిలోని కీర్తనలను శ్రీమతి చల్లా ప్రభావతి స్వరపరచగా శ్రీమతి. బి.చిన్నమదేవి, శ్రీ కె.కల్యాణరావు ఆలపించారు. ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి ఈ కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.