PUSHPAYAGAM IN APPALAYAGUNTA ON JULY 11_ అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

Tirupati, 10 July 2017: The annual Pushpayaga Mahotsavam in Sri Prasanna Venkateswara Swamy temple at Appalayagunta will be observed on Tuesday between 3pm and 6pm.

In connection with this religious fete, Ankurarpanam was performed on Monday evening as per agama shastra.

On Tuesday morning the deities will be rendered snapana tirumanjanam followed by Pushpayagam in the evening.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అప్పలాయగుంట శ్రీ ప్రసన్నవేంకటేశ్వరాలయంలో పుష్పయాగానికి ఘనంగా అంకురార్పణ

టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 11న మంగళవారం నిర్వహించనున్న పుష్పయాగానికి సోమవారం సాయంత్రం ఘనంగా అంకురార్పణ జరుగనుంది.

ఈ సందర్భంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు ఆచార్య ఋత్విక్‌వరణం నిర్వహించారు. సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరుగనుంది.

ఈ ఆలయంలో జూన్‌ 6 నుంచి 14వ తేదీ వరకు బ్రహ్మూెత్సవాలు జరిగాయి. బ్రహ్మూెత్సవాల్లో ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటికి ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం నిర్వహిస్తారు. జులై 11న మంగళవారం ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారికి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు పుష్పయాగం కన్నులపండువగా జరుగనుంది. ఇందులో పలురకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. ఆ తరువాత వీధి ఉత్సవం నిర్వహించనున్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.