ANNAMAIAH PORTRAYED ALWAR BHAKTI RASA IN HIS SANKEERTANS-PROF.J.MUNIRATNAM_ అన్నమయ్య సంకీర్తనల్లో ఆళ్వార్ల భక్తిసారం : ఆచార్య జె.మునిరత్నం

Tirupati, 6 March 2018: The portrayal of Alwar Bhaktirasa is one of the distinct features in the Sankeetans penned by Saint Poet Tallapaka Annamacharya, said retired Telugu professor of SV University Prof.J Muniratnam.

The Telugu stalwart, delivered keynote address in the two-day seminar on “Alwar and Annamaiah” organised by Alwar Divya Prabandha Project of TTD in Vikramasimhapuri University in Nellore which commenced on Tuesday.

In his lecture he said, Annamaiah has given prominence to the “Saranagati Tatwa” in his sankeertans taught by Alwars. He described Annamacharya as 13th Alwar as he continued the legacy of Alwars in Bhakti Tatwa through his sankeertans. The Professor also said, the seminars of this kind will be helpful to the students of Telugu in research.

VC of the Varsity Prof. Veeraiah, Registrar Prof.Durgaprasad, Alwar Project Spl.Officer Sri Chokkalingam were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అన్నమయ్య సంకీర్తనల్లో ఆళ్వార్ల భక్తిసారం : ఆచార్య జె.మునిరత్నం

విక్రమసింహపురి వర్సిటీలో సాహితీ సదస్సు

మార్చి 06, తిరుపతి, 2018: ఆళ్వార్లు అందించిన భక్తిసారాన్ని శ్రీ తాళ్లపాక అన్నమయ్య తన సంకీర్తనల్లో అందరికీ అర్థమయ్యేలా సరళమైన అచ్చతెలుగులో అందించారని ఎస్వీయు విశ్రాంతాచార్యులు ఆచార్య జె.మునిరత్నం ఉద్ఘాటించారు. టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నెల్లూరులోని విక్రమసింహపురి వర్సిటీలో గల సర్‌ సి.వి.రామన్‌ సెమినార్‌ హాలులో రెండు రోజుల ”ఆళ్వార్లు మరియు అన్నమయ్య” సాహితీ సదస్సు మంగళవారం ఘనంగా ప్రారంభమైంది.

ఈ సందర్భంగా ఆచార్య జె.మునిరత్నం కీలకోపన్యాసం చేస్తూ ఆళ్వార్లు అనుసరించిన శరణాగతి తత్వానికి అన్నమయ్య పెద్దపీట వేసి కీర్తనలు రచించారని తెలిపారు. ఆళ్వార్ల వారసత్వాన్ని కొనసాగించిన అన్నమయ్యను 13వ ఆళ్వార్‌గా అభివర్ణించారు. ఆళ్వార్లు, అన్నమయ్య సాహిత్యాన్ని నేటితరానికి అందించేందుకు టిటిడి ఇలాంటి సదస్సులు నిర్వహించడం అభినందనీయమని ఆయన అన్నారు. ఇలాంటి సదస్సులు తెలుగు విద్యార్థులకు, పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు.

ఈ కార్యక్రమంలో విక్రమసింహపురి వర్సిటీ ఉపకులపతి ఆచార్య వీరయ్య, రిజిస్ట్రార్‌ ఆచార్య దుర్గాప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎ.ప్రసాద్‌, తెలుగు విభాగాధిపతి ఆచార్య ఎస్‌.జయప్రకాష్‌, టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డా|| వి.జి.చొక్కలింగం, ఎంఏ తెలుగు విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.