ANNAMAIAH SANKEERTANA AKHANDAM IN TIRUPATI_ అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య సంకీర్తన అఖండం” ప్రారంభం

Tirupati, 30 August 2018: The 24 hour long uninterrupted music fiesta, Annamaiah Sankeertana Akhandam commences at Annamacharya Kalamandiram in Tirupati on Thursday evening.

The event started at 6pm and will last upto 6pm of Friday.

Meanwhile during the day on Thursday, special pujas were performed to Annamaiah idol at TTD administrative building. From there a procession was taken out covering four mada streets of Kodanda Rama Swamy temple reaching Annamacharya Kalamandiram.

Annamacharya Project Director Sri Dhanajeyulu, Superintendent Sri Narasimhulu and others took part.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

అన్నమాచార్య కళామందిరంలో ”అన్నమయ్య సంకీర్తన అఖండం” ప్రారంభం

ఆగస్టు 30, తిరుపతి 2018: టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో గురువారం సాయంత్రం అన్నమయ్య సంకీర్తన అఖండం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, వివిధ జిల్లాల నుండి వచ్చిన ఇతర కళాకారులు గురువారం సాయంత్రం 6 గంటల నుండి శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు 24 గంటల పాటు నిరంతరాయంగా సంకీర్తనలను ఆలపిస్తారు.

ముందుగా టిటిడి పరిపాలనా భవనంలో అన్నమయ్య చెక్క విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుచ్చిపై వేంచేపు చేసి శ్రీ కోదండరామాలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా సంకీర్తనలు ఆలపిస్తూ అన్నమాచార్య కళామందిరానికి తీసుకెళ్లారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ధనంజయ, సూపరింటెండెంట్‌ శ్రీ నరసింహులు, కళాకారులు, టిటిడి ఉద్యోగులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.