ANNAMAIAH SANKEERTANS SHOULD REACH ALL DEVOTEES- SVBC CHAIRMAN _ అన్నమయ్య కీర్తనలు అందరికీ చేరువకావాలి

* SELECTIONS BEGIN FOR ADIVO..elections begin for Adivo…. ALLADIVO CONTEST

Tirupati, 25 September 2021: SVBC Chairman Dr Sai Krishna Yachendra said the Annamaiah Sankeetans heralding the glory of Sri Venkateshwara Swamy should reach everyone.

Speaking on the occasion of the launch of the selection process of the “Adivo….. Alladivo” contest at the SVBC Studio on Saturday in Tirupati, Sri Yachendra said while saint poet Sri Tallapaka Annamacharya penned 32,000 sankeetans only 14,000 of them are available in all formats and the SV Recording project had recorded and digitized only 4000 sankeetans so far. 

He said the SVBC has been mandated by the TTD Chairman and EO to provide wide publicity and give prime slot for Annamaiah sankeetans.

He said under the Adivo….. Alladivo contest, all enthusiastic youth will be provided an opportunity to participate in the competitions and the selected youth will be given chance to sing in studios. The selection contests were held for youth at both Telugu states besides Chennai and Bangalore. After district-level contests, State level competitions will be conducted”, he added.

As part of the exercise, audition of contests will be held on Saturday and Sunday for the 15 to 25 year old youth of Chittoor district and appealed that youth should train in new sankeetans.

Eminent music maestros Sri Hanumanta Rao and Sri Shyamala Rao acted as judges for the competition. 

SVBC CEO Sri Suresh Kumar was also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్నమయ్య కీర్తనలు అందరికీ చేరువకావాలి

– అదివో అల్ల‌దివో ….అన్న‌మ‌య్య పాట‌ల పోటీలకు ఎంపిక ప్రారంభం

– ఎస్వీబిసి ఛైర్మ‌న్ డా. సాయి కృష్ణ యాచేంద్ర‌

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 25: తిరుమ‌ల‌ శ్రీవారి తత్త్వాన్ని లోకానికి చాటిన అన్నమయ్య కీర్తనలు అందరికీ చేరువ కావాలని ఎస్వీబిసి ఛైర్మ‌న్ డా.శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర‌ అన్నారు. ఎస్వీబిసి కార్యాల‌యం స్టూడియోలో శ‌నివారం ” అదివో అల్ల‌దివో ….అన్న‌మ‌య్య పాట‌ల పోటీలకు గాయకుల ఎంపిక కార్యక్రమం ప్రారంభ‌మ‌మైంది.

ఈ సంద‌ర్భంగా ఎస్వీబిసి ఛైర్మ‌న్ మాట్లాడుతూ, అన్నమయ్య 32 వేల కీర్తనలను రచించగా, 14 వేల కీర్తనలు ల‌భించాయ‌ని, వీటిలో ఇప్పటివరకు 4000 కీర్తనలను టిటిడి ఎస్వీ రికార్డింగ్‌ ప్రాజెక్టు రికార్డింగ్ చేసిన‌ట్లు తెలిపారు. అన్న‌మ‌య్య రాసిన కీర్తనలకు శ్రీ వేంకటేశ్వర భ‌క్తి ఛాన‌ల్ ద్వారా ప్రాధాన్యం, విస్తృత ప్ర‌చారం క‌ల్పించాల‌ని టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో, అదనపు ఈవో నిర్ణయించిన‌ట్లు చెప్పారు. అదివో అల్ల‌దివో ….కార్య‌క్ర‌మం ద్వారా ఔత్సాహికులైన యువ‌తి యువ‌కుల‌కు అన్న‌మ‌య్య పాట‌ల పోటీలకు కళాకారుల ఎంపిక పరీక్షలు నిర్వ‌హించి ఇందులో ఎంపికైన వారితో అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు పాడిస్తామ‌న్నారు.

ఆంధ్ర‌, తెలంగాణ‌ రాష్ట్రాలతో పాటు చెన్నై, బెంగుళూరు నగరాల్లోని యువ‌త‌కు అన్న‌మ‌య్య కీర్త‌న‌లపై పోటీలు నిర్వ‌హిస్తామ‌న్నారు. తొలుత జిల్లాస్థాయిలో, ఆ త‌రువాత రాష్ట్ర‌స్థాయిలో పోటీలు నిర్వ‌హిస్తామని వివరించారు.

ఇందులో భాగంగా శ‌ని, ఆది వారాల్లో చిత్తూరు జిల్లాకు చెందిన 15 నుంచి 25 సంవత్సరాల వయస్సులోపు ఉన్న గాయనీ, గాయకులకు ఎంపిక పరీక్ష నిర్వహిస్తు న్నట్లు తెలిపారు. యువ గాయ‌ని గాయ‌కులు కొత్త పాట‌లు ఆల‌పించాల‌న్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎస్వీబిసి సిఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన‌గా, ప్ర‌ముఖ సంగీత విద్వాంసులు శ్రీ హ‌నుమంత‌రావు, శ్రీ శ్యామ‌ల‌రావు న్యాయ‌నిర్ణేత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

టిటిడి ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైది.