ANNAMAIAH SANKEERTANS TO PROMOTE DEVOTIONAL EQUALITY- DR SAMUDRALA LAKSHMAIAH _ ఆధ్యాత్మిక సమైక్యత కోసం అన్నమయ్య కీర్తనలు : డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య

Tirupati,17 May 2022: TTD Purana Itihasa Project former OSD Dr Samudrala Lakshmaiah has said that in order to achieve social and devotional equality in society in those days, Saint poet Sri Annamacharya scripted sankeertans in praise of Sri Venkateswara Swamy.

 

Addressing the Sahiti Sadas at Sri Annamacharya Kala Mandiram got up by TTD as part of the 614th Jayanti celebrations of saint-poet, the veteran writer spoke on the theme of Annamaiah Adhyatmikata.

 

He said Annamaiah sankeertans comprised of basic tenets of Vedas, Mahabharata, Ramayana, Upanishads and Puranams.

 

Earlier Sri Venkata Krishnaiah team of Tirupati presented Harikatha parayanam and later another Tirupati team of Sri Uday Bhaskar, Sri Saraswati Prasad presented vocal.

 

At Mahati 

 

At the Mahati auditorium at night Dr Sushma Kumari and A Manya Chandran presented Annamaiah sankeertans while the Sri K Ravi Kumar team presented the Kuchipudi dance.

 

TTD Annamacharya Project Director Dr Vibhishana Sharma, Program coordinator Smt Lata and other officials and art lovers of Tirupati were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆధ్యాత్మిక సమైక్యత కోసం అన్నమయ్య కీర్తనలు : డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య

తిరుపతి, 2022 మే 17: ప్రజల్లో అడుగంటిన భక్తిభావాన్ని చైతన్య పరిచి ఆధ్యాత్మిక సమైక్యత సాధించేందుకు శ్రీవేంకటేశ్వరస్వామివారిని కేంద్రంగా చేసుకుని అన్నమయ్య సంకీర్తనలు రచించి వ్యాప్తి చేశారని టీటీడీ పురాణ ఇతిహాస ప్రాజెక్టు మాజీ ప్రత్యేకాధికారి డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య పేర్కొన్నారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 614వ జ‌యంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో మంగళవారం సాయంత్రం సాహితీ సదస్సు జ‌రిగింది.

ఈ సందర్భంగా డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య ”అన్నమయ్య – ఆధ్యాత్మికత‌ ” అనే అంశంపై ఉపన్యస్తూ యావత్‌ భక్తి సాహిత్యంలో అన్నమయ్యకు ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. వారి సంకీర్తనల్లో నామ సంకీర్తనకు ప్రాముఖ్యతను ఇచ్చారని చెప్పారు. ఈ కీర్తనల్లో వేదాలు, రామాయణ, మహాభారతాలు, ఉపనిషత్తులు, పురాణాల్లోని అంశాలను అన్నమయ్య స్పృశించారని తెలిపారు. అన్నమయ్య బ్రహ్మ స్వరూపమని, ఆయన అనుసరించింది బ్రహ్మమార్గమని తెలియజేశారు. శ్రీవారిపై భక్తి ద్వారా అన్నమయ్య సంపూర్ణ మానవజీవనాన్ని చవిచూశారన్నారు. శ్రీవారి కృపవల్ల అన్నమయ్య ఆధ్యాత్మిక సంకీర్తనలకు వ్యాఖ్యానం రాసే అవకాశం తనకు వచ్చిందని తెలిపారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు ఈ బాధ్యతలు నిర్వహించి పలు కీర్తనలకు పండితుల ఆమోదం పొందేలా వ్యాఖ్యానం రాసినట్టు వివరించారు.

అంత‌కుముందు ఉద‌యం 10.30 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ వేంక‌ట‌కృష్ణ‌య్య‌ బృందం హ‌రిక‌థ పారాయ‌ణం నిర్వ‌హించారు. రాత్రి 7 గంటలకు తిరుప‌తికి చెందిన శ్రీ ఉద‌య్ భాస్క‌ర్‌, శ్రీ స‌ర‌స్వ‌తి ప్ర‌సాద్ బృందం గాత్ర సంగీత స‌భ‌ జరగనుంది.

మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో…

తిరుపతి మహతి కళాక్షేత్రంలో మంగళవారం సాయంత్రం 6 నుండి తిరుప‌తికి చెందిన డా. సుష్మ‌, కుమారిఎ.మాన్య చంద్ర‌న్‌ బృందం అన్న‌మ‌య్య సంకీర్త‌న లహ‌రి గాత్రం నిర్వహించారు. రాత్రి 7.30 గంట‌లకు తిరుప‌తికి చెందిన శ్రీ కొండా ర‌వి కుమార్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన జరుగుతుంది.

ఈ కార్యక్రమంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ విభీషణ శర్మ, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ శ్రీమతి లత, ఇతర అధికారులు, పుర ప్రజలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.