ANNAMAIAH VARDHANTI OBSERVED_ ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా 515వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

Tirupati, 14 March 2018: As a tribute to saint poet Annamacharya on his 515th Death Anniversary, renowned spiritual scholar Smt Kondaveeti Jyotirmayee rendered sankeertans on Wednesday.

The Annamaiah Aradhanotsavams was observed at Annamacharya Kalamandiram.

On the other hand in Mahati also Smt Ramya Kiranmayi team from Vizag rendered sankeertans.

Annamacharya Project Director Sri Dhananjaya was also present


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం అన్నమాచార్య కళామందిరంలో ఘనంగా 515వ వర్థంతి మహోత్సవాలు ప్రారంభం

తిరుపతి, 2018 మార్చి 14: టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీమాన్‌ తాళ్లపాక అన్నమాచార్యుల 515వ వర్ధంతి మహోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి ఆలపించిన దినము ద్వాదశి, సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానం ఆకట్టుకుంది.

ఇందులో ”బ్రహ్మకడిగిన పాదము…., శరణంటూ…, హరి అవతారమితడు అన్నమయ్య.., శరణు శరణు…” కీర్తనలను కళాకారులు రాగభావయుక్తంగా ఆలపించారు. అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు.

భక్తిభావాన్ని పంచిన శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి గాత్రం :

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా ఉదయం 10.30 గంటలకు అన్నమయ్య సంకీర్తనలను ప్రముఖ గాయని శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయి సుమధురంగా ఆలపించారు. ఇందులో ”చల్లరే హరిపై……, గరుడగమన…., దీనరక్షకుడు….., నాటికినాడే…., నారాయణాచ్యుతానంత…, రూకలై మాటలై….” కీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయ. ఈ సందర్భంగా శ్రీమతి కొండవీటి జ్యోతిర్మయిని అన్నమయ్య ప్రాజెక్ట్‌ అధికారులు శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదాలను అందించారు.

కాగా, సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు మచిలీపట్నంకు చెందిన శ్రీమతి సి.కిరణ్మయి బృందం సంగీతసభ నిర్వహించనున్నారు. అనంతరం రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు గుంటూరుకు చెందిన అమరావతి జానపద కేశవ సంస్థ ఆధ్వర్యంలో నృత్య కార్యక్రమం జరుగనుంది.

మహతిలో :

శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు విశాఖపట్నంకు చెందిన శ్రీమతి సిహెచ్‌.రమ్య కిరణ్మయి బృందం గాత్ర సంగీత కార్యక్రమం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు శ్రీ ధనుంజయుడు, రీసెర్చి అసిస్టెంట్‌ డా|| సి.లత ఇతర అధికారులు, ఆధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.