SECURITY GUARDS FELICITATED BY CVSO_ మెరుగ్గా విధులు నిర్వహించిన టిటిడి నిఘా, భద్రతా సిబ్బందికి రివార్డులు

Tirupati, 14 March 2018: About 50 security sleuths belonging to all the seven sectors of TTD security services were felicitated by CV & SO Sri A Ravikrishna on Wednesday.

Speaking on this occasion, in his chambers in TTD Administrative Building in Tirupati the CV & SO said, the security personnel have showcased their skills in nabbing miscreants while discharging their duties in their respective sectors.

While lauding them, the CV & SO said, he will foresee the same spirit from them in future too.

Additional CV & SO Sri Sivakumar Reddy, VSO Sri Ravindra Reddy, all sector AVSOs were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మెరుగ్గా విధులు నిర్వహించిన టిటిడి నిఘా, భద్రతా సిబ్బందికి రివార్డులు

మార్చి 14, తిరుపతి, 2018: శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులకు భద్రతాపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగ్గా విధులు నిర్వహించిన 50 మంది టిటిడి నిఘా, భద్రతా సిబ్బందికి సివిఎస్‌వో శ్రీ ఆకె రవికృష్ణ ప్రశంసాపత్రం, నగదు రివార్డులు అందజేశారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సివిఎస్‌వో కార్యాలయంలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా సివిఎస్‌వో మాట్లాడుతూ టిటిడిలోని 7 సెక్టార్లలో విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రోత్సాహకాలు అందించామని, తద్వారా భద్రతా సిబ్బంది మరింత మెరుగ్గా విధులు నిర్వహించేందుకు వీలవుతుందని అన్నారు. తిరుమలలో మొదటి దశలో సిసి కెమెరాల ఏర్పాటుపనులు ముమ్మరంగా జరుగుతున్నాయని, త్వరలోనే పూర్తవుతాయని తెలిపారు. తిరుమలలోని హోటళ్లలో అధిక ధరలు వసూలు చేసినా, నిషేధిత పదార్థాల సమాచారం తెలిసినా టిటిడి విజిలెన్స్‌ విభాగానికి 0877-2263695, 2263828, కాల్‌ సెంటర్‌కు 0877-2233333 నంబర్లకు భక్తులు ఫిర్యాదులు, సూచనలు చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో టిటిడి అదనపు సివిఎస్‌వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఎస్‌పిఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్లు శ్రీ మనోహర్‌, శ్రీ శంకర్‌రావు, ఎవిఎస్‌వోలు శ్రీ కూర్మారావు, శ్రీ నందీశ్వరరావు, శ్రీ రామచంద్రయ్య, శ్రీ చిరంజీవి, శ్రీ సురేంద్ర, శ్రీ పార్థసారధిరెడ్డి, శ్రీ గంగరాజు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.