ANNAMAYYA VARDHANTHI FESTIVAL ON MARCH 14-17_ మార్చి 14 నుండి 17 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

METLOTSAVAM AT ALIPERI ON MARCH 13

Tirupati, 3 March 2018: The 515th death anniversary of Prose-style poet Sri Tallapaka Annamacharya will be grandly celebrated as Metlotsavam at the Padala Mandapam of Alipiri on March13.

The artisans of the Annamcharya projet along with bhajan mandals will perform Saptagiri Sankeertana Gosti gana at the venue in the morning at 6am. After the Metla pooja the arsits will commence climbing tirumala hillock on foot while chanting Annamayya sankeertans. Besides TTD senior officials, artists from bhajan mandals from across the state will participate.

As part of the Annamacharya Vardhanti utsav, gosti ganam and bhakti sangeet programs will be performed at the Narayanagiri gardens on March 14. Similarly the Literary session will also be held for 4 days on saint-poet Annamacharya’s works for four days from March 14-17 at Annamayya Kala Mandir and Mahati auditorium.

Cultural programs including bhakti sangeet and devotional programs will also organised at the Dhyana mandir and 108 feet Annamayya statue at Tallapaka in Kadapa district.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 14 నుండి 17 వ తేదీ వరకు అన్నమయ్య వర్థంతి ఉత్సవాలు

మార్చి 13న అలిపిరిలో మెట్లోత్సవం

తిరుపతి, 2018 మార్చి 03: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 515వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద మార్చి 13వ తేదీ టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో మెట్లోత్సవం వైభవంగా జరుగనుంది.

టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, భజన మండళ్ల కళాకారులు ఉదయం 6.00 గంటల నుంచి అన్నమాచార్యుల వారి ”సప్తగిరి సంకీర్తనా గోష్ఠిగానం” నిర్వహిస్తారు. అనంతరం శాస్త్రోక్తంగా మెట్లపూజ జరుగనుంది. ఆ తరువాత కళాకారులు సంకీర్తనలు గానం చేస్తూ కాలినడకన తిరుమలగిరులను అధిరోహిస్తారు. తితిదే ఉన్నతాధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి భజన మండళ్ల కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

అన్నమాచార్య వర్ధంతి ఉత్సవాల్లో భాగంగా మార్చి 14వ తేదీన తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలో గోష్టిగానం, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 14 నుండి 17వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సులు, మహతి కళాక్షేత్రం, తాళ్లపాకలోని ధ్యానమందిరం, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.