UGADI CELEBRATIONS AT SRI PAT_ మార్చి 18న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

Tirupati, 3 March 2018: The prestigious festival of Ugadi will be celebrated in a grand manner at the Sri Padmavati Ammavari Temple on March 18.

As part of the celestial event Suprabhatham and Sahasranama archana will be performed to the deity at 5am. Abhisekam will be performed to the utsava idols at the Sri Krishnaswamy mandapam in the evening at 3pm to 4pm. Later from 6pm to 7.30pm the Ammavaru will be paraded on the mada streets of Trichanoor on a flower decked palanquin. After that Panchanga Shravanam and Ugadi Asthanam will be conducted.

In view of the special rituals on the day, the TTD has cancelled the arjita sevas like the Kukumarchana, Sahasra dipalankara sevas etc. on March 18.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మార్చి 18న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు

తిరుపతి, 2018 మార్చి 03: సిరుల తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 18వ తేదీ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఉదయం 5.00 గంటలకు సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామ అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 3.00 నుండి 4.00 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు

అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు పుష్ప పల్లకిలో అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి 8.00 నుండి 8.30 గంటల వరకు పంచాంగ శ్రవణం, ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా ఆర్జితసేవలైన కుంకుమార్చన, సహస్రదీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.