ANNAMAIAYYA BHAKTI RANJANI CD RELEASED_ అన్నమయ్య భక్తి రంజని సిడి ఆవిష్కరణ
Tirupati, 14 Aug. 19: The audio CD on Sankeertans of Saint Poet Sri Tallapaka Annamacharya composed by SV Music college lecturer Sri Sabari Girish was released on Wednesday evening at Annamaicharya Kalamandiram in Tirupati.
Project Director Sri B Vishwanath released the CD named Annamaiah Bhakti Ranjani sung by Kum Meenakshi Sabari and Kumari Rekha.
Later the artistes presented a few notes which enthralled the music lovers.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
అన్నమయ్య భక్తి రంజని సిడి ఆవిష్కరణ
తిరుపతి, 2019 ఆగస్టు 14: శ్రీవారు జన్మించిన శ్రవణానక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం సాయంత్రం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో “అన్నమయ్య భక్తి రంజని” సిడిని అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ ఆచార్య బి.విశ్వనాథ్ ఆవిష్కరించారు.
ఈ సిడిలోని సంకీర్తనలను ఎస్వీ సంగీత కళాశాల అధ్యాపకులు శ్రీ ఎ.శబరిగిరీష్ స్వరపరిచారు. కుమారి మీనాక్షి శబరి, కుమారి రేఖతో కలిసి శ్రీ శబరిగిరీష్ ఈ సిడిలోని సంకీర్తనలను గానం చేశారు. ఈ సందర్భంగా గాయకులను శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. అనంతరం గాయనీ గాయకులు ఈ సంకీర్తనలను అద్భుతంగా పాడి వినిపించారు.
ఈ సిడిలోని సంకీర్తనలను టిటిడి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. భక్తులు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.