DEVOTEES POUR IN APPRECIATION FOR TTD ACTIVITIES AND SVBC PROGRAMS _ ఎస్వీబిసి కార్య‌క్ర‌మాల‌పై భక్తుల ప్రశంసలు

TIRUMALA, 05 APRIL 2024: The pilgrim callers from across the country have poured in appreciation on various pilgrim initiates taken up by TTD as well the devotional programmes on Sri Venkateswara Bhakti Channel besides giving some valuable suggestions to TTD to improve further during the monthly Dial your EO.

The monthly live Phone in programme with TTD EO was held at the Meeting Hall of the TTD Administrative Building in Tirupati on Friday. 

A total of 29 callers from various states across the country interacted with EO over phone and given their feedback. Some Excerpts:

Callers Smt Annapurna from Visakhapatnam and Sri Venkateswarulu from Tirupati lauded the temple administration for bringing out various reforms in terms of darshan, accommodation and other facilities keeping in view the larger interests of the common pilgrims besides appreciating various devotional programmes like Ayodhyakanda Parayanam, live Utsavams, spiritual discourses etc. on SVBC.

Thanking the callers, the TTD EO Sri AV Dharma Reddy said, such words of appreciation will boost the spirits of all the employees to offer services to the multitude of visiting pilgrims, with more enthusiasm. He said, for the several decades, all the administrators, strong workforce of TTD have been doing a lot to improvise and offer better services to the pilgrims.

Another caller, Sri Pavan Kumar from Hyderabad suggested EO to extend the last bus service from Tirumala to Tirupati by one more hour as many pilgrims are being stranded in Hill town due to time restrictions. Answering the caller, the EO said, the Tirumala Ghat Roads falls under the Forest reserve and they have to follow the Time restrictions between 12midnight till 3am as per the Forest norms as many wild animals crisscross the paths during that period. However, the EO said, during heavy rush period and on special days, the down ghat is kept opened round the clock to avoid pilgrim congestion in Tirumala.

When callers Sri Ramesh from Jagityala and Sri Kiran Kumar from Tirupati brought to the notice of the EO about non-receiving of offline lucky dip messages, the EO said, the app is working perfectly but due to poor range of mobile signals a few pilgrims might be facing this problem. He also said that he has recently held a review meeting with all the mobile companies to enhance their signal capacity to avoid this issue.

Sri Dinesh from Hyderabad sought EO to resume distribution of annaprasadam in compartments which used to be before Covid pandemic, the EO said, TTD has resumed all the services long back post Covid and even a donor has also set up 120 RO plants in Tirumala for providing poor drinking water facility to the devotees at all places.

One Sri Venkatesh from Gujrat sought EO the procedure to uplift an ancient 120 year old Sri Venkateswara temple in the state, to which EO replied TTD will construct or renovate the temple as per the request with Sri Venkateswara Alaya Nirmana Trust (SRIVANI) funds after a team of officers from TTD visit the temple and verify the possibilities. 

When Sri Srikant from Manchiryala sought EO about the status of the temple in his place, the EO said, in the last three years we have constructed over 3600 temples out of which 1700 are already completed and others in different states of progress. “We receive thousands of requests every day and construction process will be taken only after thorough verification which takes some time”, he answered.

One pilgrim caller Sri Nagaraju from Hyderabad brought to the notice of EO about the quick darshan and delay in issuing laddus at the Laddu Prasadam Complex due to change of shifts, the EO said, at present nearly 60 counters are operating and we will enhance that by another 15 during the ensuing summer vacation. He said the problems of line waiting queue lines in laddu complex will be sorted out soon.

When a caller Sri Venakteswarulu from Tirupati suggested EO to think of introducing VIP Break darshan also under Lucky Dip, the EO said, he will discuss the possibilities. “Keeping in view the summer rush, we have dispensed with VIP break system at present and increased the SSD (Free Darshan) tokens to 30thousands in Tirupati. Our priority is to provide more dashan hours to common pilgrims during the ensuing summer vacation”, he asserted.

Some other callers have given feedback that included on Srivari Seva, Accommodation and Darshan to Donors, physically challenged, senior citizens and parents with infants etc.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీబిసి కార్య‌క్ర‌మాల‌పై భక్తుల ప్రశంసలు

– డ‌య‌ల్ యువ‌ర్ ఈవోలో భ‌క్తులు

తిరుమ‌ల‌, 2024 ఏప్రిల్ 05: తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై టీటీడీ చేపట్టిన సుంద‌రాకాండ‌, అయోధ్యకాండ, భగవద్గీత, గ‌రుడ పురాణం పారాయణం వంటి ఆధ్యాత్మిక‌, భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మాలను ప్ర‌సారం చేస్తున్న‌ శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్‌పై దేశవ్యాప్తంగా ఉన్న భ‌క్తులు ప్రశంసల వ‌ర్షం కురిపించారు.

తిరుప‌తి టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలోని మీటింగ్ హాల్‌లో శుక్ర‌వారం జ‌రిగిన‌ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.

విశాఖపట్నంకు చెందిన‌ శ్రీమతి అన్నపూర్ణ మాట్లాడుతూ, టీటీడీ భ‌క్తుల‌కు అందిస్తున్న వ‌స‌తి, ద‌ర్శ‌నం, అన్న‌ప్ర‌సాదాలు త‌దిత‌ర సౌక‌ర్య‌లు చాలా బాగున్నాయ‌న్నారు. అందుకు ఈవో స‌మాదానం ఇస్తూ, ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఇటువంటి ప్రశంసలు మాకు, మా ఉద్యోగులందరికీ స్ఫూర్తిని కలిగిస్తాయ‌ని, మరింత ఉత్సాహంతో భ‌క్తులకు మెరుగైన‌ సేవలు అందిస్తామ‌న్నారు. అనేక దశాబ్దాలుగా ఛైర్మ‌న్లు, ఈవోలు, జేఈవోలు, అధికారులు, ఉద్యోగులు యాత్రికులకు మెరుగైన సేవలను అందించడానికి చాలా కృషి చేశార‌న్నారు.

హైదరాబాద్‌కు చెందిన శ్రీ పవన్ కుమార్ మాట్లాడుతూ, తిరుమల నుండి తిరుపతికి వెళ్లే చివరి బస్సు సర్వీసును మరో గంట పాటు పొడిగించాల‌ని కోరారు. ఆల‌స్యం కార‌ణంగా చాలా మంది యాత్రికులు తిరుమ‌ల‌లోనే ఉంటున్నార‌న్నారు. దీనిపై ఈవో మాట్లాడుతూ, తిరుమల ఘాట్ రోడ్లు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయ‌న్నారు. కావున‌ అటవీ నిబంధనల ప్రకారం అర్ధరాత్రి 12 గంటల నుండి తెల్లవారుజామున 3 గంటల వరకు ఆంక్షలు పాటించాలని, ఆ సమయంలో అనేక వన్యప్రాణులు దారులు దాటుతాయని చెప్పారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో, ప్రత్యేక రోజులలో తిరుమలలో భక్తుల రద్దీని నివారించేందుకు 24 గంటలూ డౌన్‌ఘాట్ రోడ్డును తెరిచి ఉంచుతామని తెలిపారు.

జగిత్యాలకు చెందిన శ్రీ ర‌మేష్, తిరుప‌తికి చెందిన శ్రీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ఆఫ్ లైన్‌ లక్కీ డిప్ మెసేజ్‌లు రావ‌డంలేదు, మెసేజ్‌లు వ‌చ్చేలా చ‌ర్య‌లు తీసుకొండి అని కోరారు. అందుకు ఈవో స‌మాదానం ఇస్తూ, ఆఫ్ లైన్ లక్కీ డిప్ యాప్ సరిగ్గా పనిచేస్తోందని, అయితే మొబైల్ సిగ్నల్స్ సరిగా లేకపోవడం వల్ల కొంతమంది భ‌క్తులు ఈ సమస్యను ఎదుర్కొంటున్న‌ట్లు తెలిపారు. ఈ సమస్యను నివారించేందుకు సిగ్నల్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు అన్ని మొబైల్ కంపెనీలతో ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించినట్లు చెప్పారు.

హైదరాబాద్‌కు చెందిన‌ శ్రీ దినేష్ మాట్లాడుతూ, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో కోవిడ్‌కు ముందు ఉన్న‌ట్లు అన్నప్రసాదం, తాగునీరు పంపిణీని పునఃప్రారంభించాల‌ని కోరారు. దీనిపై ఈవో మాట్లాడుతూ, కోవిడ్ తర్వాత టీటీడీ అన్నిసేవలను తిరిగి ప్రారంభించింద‌న్నారు. దాతల స‌హ‌కారంతో తిరుమలలో 120 ఆర్‌ఓ ప్లాంట్‌లను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. అన్ని చోట్ల భక్తులకు తాగునీటి సౌకర్యం అద్భుతంగా ఉంద‌న్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కంపార్ట్‌మెంట్లలో అన్నప్రసాదం, తాగునీరు అందిస్తున్న‌ట్లు చెప్పారు.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన‌ శ్రీ వెంకటేష్ మాట్లాడుతూ, గుజరాత్ రాష్ట్రంలో 120 ఏళ్ల పురాతన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం ఉంద‌ని, దానిని పునరుద్ధరించ‌డానికి ఈవో స‌ల‌హా కోరారు. అందుకు ఈవో స‌మాదానం ఇస్తూ, సాధార‌ణంగా భ‌క్తుల కోరిక మేర‌కు నూత‌న ఆల‌యాలు నిర్మించాల‌న్నా, పురాత‌న ఆల‌యాలు పున‌రుద్ధ‌రించాల‌న్నా టీటీడీ అధికారుల బృందం ఆలయాన్ని సందర్శించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి శ్రీవాణి నిధులతో ఆలయాన్ని పునఃనిర్మిస్తుంద‌న్నారు.

మంచిర్యాలకు చెందిన‌ శ్రీ శ్రీకాంత్ మాట్ల‌డుతూ, గ‌తంలో త‌న విజ్ఞ‌ప్తికి స్పందించి గ‌త ఏడాది డిసెంబ‌రు నెల‌లో టీటీడీ అధికారుల బృందం శ్రీవారి ఆల‌య నిర్మాణానికి త‌మ‌ ప్రాంతాన్ని సంద‌ర్శించింద‌న్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు ఆల‌య నిర్మాణ పురోగ‌తిపై ఎలాంటి స‌మాచారం అంద‌లేద‌న్నారు. అందుకు ఈవో స్పందిస్తూ, శ్రీవాణి ట్ర‌స్టు ద్వారా గత మూడేళ్లలో 3600 ఆలయాలు నిర్మించామని, అందులో 1700 ఆల‌యాలు పూర్తయ్యాయని, మరికొన్ని వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్నట్లు తెలిపారు. టీటీడీకి ప్రతిరోజూ ఆల‌యాల నిర్మాణాల‌కు సంబంధించి వేలాది అభ్యర్థనలు వ‌స్తున్నాయ‌ని, వాటిని ప‌రిశీలించి నిర్మాణ ప్రక్రియ చేపడ‌తామ‌న్న‌రారు. ఈ క్ర‌మంలో కొంత స‌మ‌యం ప‌డుతుంద‌న్నారు. త్వ‌ర‌లో త‌మ అధికారులు ఆల‌య పురోగ‌తిపై స‌మాచారం అందిస్తార‌న్నారు.

హైదరాబాద్‌కు చెందిన‌ శ్రీ నాగరాజు మాట్లాడుతూ, శ్రీ‌వారి దర్శనం త్వ‌ర‌గా పూర్త‌వుతోంద‌ని, కానీ లడ్డూ ప్రసాదం కాంప్లెక్స్‌లో షిఫ్టుల మార్పు కారణంగా లడ్డూల జారీలో చాలా ఆల‌స్యమ‌వుతున్న‌ద‌ని, త్వ‌ర‌గా ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకోవ‌ల‌సిందిగా కోరారు. దీనిపై ఈవో మాట్లాడుతూ, ప్రస్తుతం 60 కౌంటర్లు పనిచేస్తున్నాయ‌ని, వేసవి సెలవుల్లో అద‌నంగా మరో 15 కౌంట‌ర్లు ఏర్పాటు చేసి, లడ్డూ కాంప్లెక్స్‌లోని క్యూ లైన్లలో భ‌క్తులు వేచి ఉండే సమస్య లేకుండా పరిష్కరిస్తామ‌న్నారు.

తిరుప‌తికి చెందిన శ్రీ వేంక‌టేశ్వర్లు మాట్లాడుతూ, టీటీడీ స‌మాన్య భ‌క్తుల కొర‌కు ద‌ర్శ‌న‌, వ‌స‌తి విధానాల‌లో ఎన్నో సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చినందుకు ఈవో మ‌రియు ఇత‌ర అధికారుల బృందానికి అభినంద‌న‌లు తెలిపారు. ఆఫ్ లైన్ ల‌క్కీ డిప్ ద్వారా విఐపి బ్రేక్‌ దర్శనాన్ని కూడా ప్రవేశపెట్టండి. అందుకు ఈవో స్పందిస్తూ, “వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను ర‌ద్ధు చేసింది. తిరుపతిలో ఎస్ఎస్‌డి (ఉచిత దర్శనం) టోకెన్ల‌ను 30 వేలకు పెంచాము. వేసవి సెలవుల్లో సాధారణ భ‌క్తులకు ఎక్కువ సమయం కేటాయించడమే మా ప్రాధాన్యత” అని ఆయ‌న చెప్పారు. ఆఫ్‌లైన్‌ ల‌క్కీ డిప్ ద్వారా విఐపి బ్రేక్‌ దర్శనాన్ని ప్ర‌వేశ పెట్టే సూచ‌న‌పై సాధ్యాసాధ్యాలను అధికారుల‌తో చర్చిస్తామ‌న్నారు.

మరికొందరు భ‌క్తులు శ్రీవారి సేవ, దాతలు, దివ్యాంగులు, వ‌యో వృద్ధులు, సంవ‌త్స‌రంలోపు చిన్న పిల్లల‌ తల్లిదండ్రులకు వసతి, దర్శనాలు, కాష‌న్ డిపాజిట్ రీఫండ్ త‌దిత‌ర అంశాల‌కు సంబంధించి త‌మ త‌మ సూచ‌న‌లు కూడా అందించారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.