GRAND ANNAMAIAH DWADASI DAY OBSERVED_ ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

Tirupati, 27 Aug. 19: TTD grandly organised the Annamaiah Dwadasa Day on Tuesday at the Annamacharya Kala Mandir.

The artists of the Annamacharya project conducted Gosti ganam with dwadasi sankeertans followed by harikatha Parayanam by Sri Devipradad Bhagavathar Of Kurnool and Anna Prasadam.

Later in the evening, Sri Ravichandra of Tirupati conducted gatra sangeet Program.

AEO Sri Ashok Kumar, Superintendent Sri Venkataramana, Program coordinator Smt Lata and others participated.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా అన్నమయ్య దినము ద్వాదశి

తిరుపతి, 2019 ఆగ‌స్టు 27: పరమపవిత్రమైన ద్వాదశి తిథినాడు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు శ్రీవారిలో ఐక్యమైన మహత్తర సందర్భాన్ని పురస్కరించుకుని టిటిడి మంగ‌ళ‌వారం నాడు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ‘అన్నమయ్య దినము ద్వాదశి’ని ఘనంగా నిర్వహించింది.

ఈ సందర్భంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల బృందం దినము ద్వాదశి సంకీర్తనలతో గోష్టిగానం నిర్వహించారు. ఉదయం 11.00 నుండి 1.00 గంటల వరకు క‌ర్నూలుకు చెందిన‌ శ్రీ ర‌విప్ర‌సాద్ భాగవతార్‌ బృందం హరికథా పారాయణం చేశారు. మధ్యాహ్నం భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది.

సాయంత్రం 6.00 నుండి రాత్రి 8.00 గంల వరకు తిరుపతికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీ ర‌విచంద్ర గాత్ర సంగీత కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ అశోక్‌కుమార్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌ట‌ర‌మ‌ణ‌, శ్రీ న‌ర‌సింహులు, ప్రొగ్రాం కో ఆర్డినేటర్‌ శ్రీమతి ల‌త‌, ఇతర అధికారులు, విశేషసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.