GRAND SEETHARAMA KALYANAM AT SRI KRT_ శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

Tirupati, 27 Aug. 19: As part of the monthly practice of performing Seetarama Kalyanam on Punarvasu star, the birth star is Lord Rama, the holy event was conducted on Tuesday morning at Sri Kodandarama Swamy temple.

Later in the evening, the utsava idols of Sri Seetha Lakshmana with Sri Kodandarama Swamy were paraded on Mada streets and Asthanam and unjal Seva at Sri Ramachandra Pushkarani.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీకోదండరామాలయంలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

తిరుపతి, 2019 ఆగస్టు 27: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో మంగళవారం శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. శ్రీరామచంద్రమూర్తి జన్మించిన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయంలో ప్రతినెలా కల్యాణం నిర్వహిస్తారు.

ఇందులోభాగంగా ఆలయంలోని కల్యాణమండపంలో ఉదయం 11.00 గంటలకు కల్యాణోత్సవ ఘట్టం ప్రారంభమైంది. అర్చకులు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం నిర్వహించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న గృహస్తులకు ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేశారు.

ఈ సందర్భంగా సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామ స్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఊంజల్‌సేవ, ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ తిరుమలయ్య, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీ మునిత్నం, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.