ANNAMAYYA PARATATVAMU CD RELEASED _ ”అన్నమయ్య పరతత్వం”, ”భజగోవిందం” సిడిలను అవిష్కరించినటిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

Tirupati, 25 August 2018: Annamacharya CDs were released on Saturday in Annamacharya Kalamandiram at Tirupati.

Annamaiah Paratatvamu CD sung by Sri.A.Sabari Girish, Kum. A.Meenakshi and Bhaja Govindam (Telugu Translation) Composed by Late. Sri. Punnama Raju Nageswara Rao sung by Sri.Vasa Venkata Vara Prasad were released on the occasion.

Latest the artistes presented some songs and enthused the audience.

S.V.Recording Project Officer and Spl.Gr.DyEO Sri Munirathnam Reddy, Vengamamba Project co-ordinator Dr KJ Krishnamurthi were also present.


ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

”అన్నమయ్య పరతత్వం”, ”భజగోవిందం” సిడిలను అవిష్కరించినటిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌

తిరుపతి, 2018 ఆగస్టు 25 శ్రీవేంకటేశ్వరస్వామివారు జన్మించిన శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శనివారం సాయంత్రం ”అన్నమయ్య పరతత్వం” ”భజగోవిందం” సిడిలను టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ అన్నమయ్య సంకీర్తనల్లోని అర్థాన్ని, పరమార్థాన్ని భక్తులకు తెలియజేసేందుకు ప్రతినెలా శ్రవణా నక్షత్రం రోజున సిడిలను ఆవిష్కరిస్తున్నట్టు వివరించారు. బాలకళాకారులు, యువ కళాకారులు, నిష్ణాతులైన కళాకారులతో సంకీర్తనలను స్వరపరిచి, గానం చేసి రూపొందిస్తున్న సిడిలకు విశేష స్పందన వస్తోందన్నారు.

అనంతరం ”అన్నమయ్య పరతత్వం” సిడిలోని సంకీర్తనలను తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల గాత్రం అధ్యాపకులు శ్రీ ఎ.శబరిగిరీష్‌ స్వరపరిచి, గానం చేశారు. అదేవిధంగా ”భజగోవిందం” సిడిలోని సంకీర్తనలను కీర్తిశేషులు శ్రీమాన్‌ పున్నమరాజు నాగేశ్వరరావు తెలుగులో అనువాదం చేయగా, శ్రీవాసా వేంకట వరప్రసాద్‌ స్వరపరిచి, గానం చేశారు.

ఈ సందర్భంగా శ్రీ శబరిగిరీష్‌, శ్రీ వాసా వేంకట వరప్రసాద్‌లను శ్రీవారి ప్రసాదం, శాలువతో ఘనంగా సన్మానించారు. అనంతరం సిడిలోని కీర్తనలను శ్రీ శబరిగిరీష్‌, శ్రీ వాసా వేంకట వరప్రసాద్‌లు సుమధురంగా గానం చేశారు.

ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీ వేంకటేశ్వర రికార్డింగ్‌ ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీమునిరత్నం రెడ్డి, టిటిడి ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.