ASHTOTHARA SHATA KALASABHISHEKAM IN SRI KRT ON AUG 26 _ ఆగస్టు 26న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

Tirupati 25 August 2018: TTD plans to perform Ashtottara Sata Kalasabhishekam at Sri Kodandarama Temple on Aug 26 at 10AM and devotees could participate with a token payment of Rs.50.

As part of the festival the utsava idols of Sri Kodandaramaswamy along with Sita and Lakshman will be taken around in a procession in the Mada streets of the temple in the evening. Later the Asthanam will be performed at the Ramachandra Pushkarini and offered Pushkarini harati.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

ఆగస్టు 26న శ్రీకోదండరామాలయంలో అష్టోత్తర శతకలశాభిషేకం

తిరుపతి, 25 ఆగస్టు 2018 ;తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 26వ తేదీ ఆదివారం అష్టోత్తర శతకలశాభిషేకం వైభవంగా జరుగనుంది. ఆలయంలో ఉదయం 10.00 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. భక్తులు ఒక్కొక్కరు రూ.50/- చెల్లించి ఈ సేవలో పాల్గొనవచ్చు.

అనంతరం సాయంత్రం 5.30 గంటలకు శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీకోదండరామస్వామివారి ఉత్సవమూర్తులను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అక్కడినుంచి శ్రీరామచంద్ర పుష్కరిణికి తీసుకెళ్లి ఆస్థానం చేపడతారు. ఆ తరువాత పుష్కరిణి హారతి నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.