ANNAMCHARYA SANKEERTANS ENTHRALLS AUDIENCE_ ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు

Tirupati, 2 May 2018: The special devotional programmes organised in connection with Annamacharya 610th Death Anniversary have been attracting denizens in a big way.

On Wednesday, the Annamacharya songs rendered by the project artistes enthralled the music lovers in Annamacharya Kalamandiram and Mahati Auditorium in Tirupati.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనలు

తిరుపతి, 2018 మే 2: తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులవారి 610వ జయంతి ఉత్సవాలు బుధవారం నాలుగో రోజుకు చేరుకున్నాయి.

ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు శ్రీ బి.రఘునాథ్‌, శ్రీమతి ఆర్‌.బుల్లెమ్మ, శ్రీమతి కె. విశాలాక్ష్మీ, శ్రీమతి ఆర్‌.సుశీల నిర్వహించిన గాత్ర సంగీత కార్యక్రమానికి విశేషస్పందన లభించింది. ”వలపుల వలపుల వయ్యారి…., అదివో అల్లదివో….., తెలిసితే మోక్షం తెలియకున్న బంధం…, యాడకెడా నీ చరితలు ఏమని పొగడవచ్చు….” తదితర కీర్తనలను రాగయుక్తంగా ఆలపించారు.

సాయంత్రం 6.00 నుండి రాత్రి 7.30 గంటల వరకు హైదరాబాద్‌కి చెందిన శ్రీ పవన్‌ కుమార్‌ చరణ్‌ బృందం నృత్యకార్యక్రమం, రాత్రి 7.30 నుండి 9 గంటల వరకు హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి సుధామాల బృందం నృత్య కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.00 నుంచి రాత్రి 8.00 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులు శ్రీ ఎం.పరిమళ రమేష్‌ బృందం లయ వాయిద్య సమ్మేళనం కార్యక్రమం నిర్వహిస్తారు.

ఆ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ శ్రీ ధనుంజయులు, ఏఈవో శ్రీమతి శాంతి, అన్నమాచార్య ప్రాజెక్ట్‌ రీసెర్ట్‌ అసిస్టెంట్‌ శ్రీమతి లత ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.