TIRUPATI JEO INSPECTS SSD COUNTERS_ సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల పరిశీలన

Tirupati, 2 May 2018: JEO Sri P Bhaskar on Wednesday inspected Slotted Sarva Darshan (SSD) counters in Tirupati along with officials concerned.

He inspected the counters located at RTC bus stand, II and III Chowltries, Srinivasam and Alipiri and instructed the PRO to give wide publicity on SSD counters and the Radio and Broad Casting officials to give continuous announcements on the SSD counters through mikes for the information of the public.

He said, under the instructions of TTD EO Sri Anil Kumar Singhal, we have also arranged some counters exclusively for aged and physically challenged persons.

SE I Sri Ramesh Reddy, DyEO Smt Kasturi, RTC RM Sri Chengal Reddy and others were present.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల పరిశీలన

తిరుపతి, 2018 మే 2: తిరుపతిలోని శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం, రైల్వేస్టేషన్‌ వెనుకవైపు గల సత్రాలు, ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతాల్లోని సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్లను బుధవారం టిటిడి తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ పరిశీలించారు. సమయ నిర్దేశిత సర్వదర్శనం కౌంటర్ల గురించి భక్తులకు తెలిసేలా రైల్వే స్టేషన్‌, బస్టాండు, భక్తుల సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలలో కరపత్రాలు, ఫ్లెక్సీల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. టిటిడి వసతి సముదాయాల్లో రేడియో బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా తరచూ ప్రకటనలు చేయాలని సూచించారు.

టిటిడి ఈవో శ్రీ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ సూచనల మేరకు తిరుపతిలో విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌, ఆర్టీసీ బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌ వెనుకవైపుగల రెండు, మూడు సత్రాలలో కౌంటర్లు ఏర్పాటు చేశామని జెఈవో తెలిపారు. ఆయా ప్రాంతాలలో వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం ఒక్కో కౌంటర్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశామన్నారు. ఈ విధానాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

జెఈవో వెంట ఎస్‌ఈ-1 శ్రీ రమేష్‌రెడ్డి, డిప్యూటీ ఈవో శ్రీమతి కస్తూరి, విఎస్‌వో శ్రీఅశోక్‌కుమార్‌గౌడ్‌, ఎవిఎస్‌వో శ్రీ పార్థసారధిరెడ్డి, డిఈ ఎలక్ట్రికల్‌ శ్రీ రవిశంకర్‌ రెడ్డి, ఈడిపి ఓఎస్‌డి శ్రీ వేంకటేశ్వరనాయుడు, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీ చెంగల్‌ రెడ్డి ఇతర అధికారులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.