ANNAPRASADAM DELICACIES ATTRACT DEVOTEES _ శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భక్తులకు రుచిక‌ర‌మైన‌ అన్నప్రసాదాలు

CONTINUOUS SUPPLY OF WATER AND BUTTERMILK

Vontimitta, 17 April 2024: TTD continuously serves delicious Annaprasadams to thousands of visiting devotees during the ongoing Sri Rama Navami Brahmotsavams at Vontimitta Sri Kodandarama Swamy Temple which commenced on Wednesday.

Drinking water and buttermilk are continuously provided to the devotees who come for darshan.  

TTD has also laid German sheds and coolers have been arranged in the temple premises so that the devotees do not suffer from the scorching heat of the sun.  

Everyday breakfast is being served at 7 am, from 10.30 am to 4 pm and again from 6.30 pm to 7 pm delicious rice, sambar, rasam, buttermilk, green tea, curry and sweet Pongal are served.

TTD has deployed about 50 Annaprasadam department staff for catering to the needs of the devotees by preparing delicious delicacies.

DyEO Rajendra is supervising the arrangements of Annaprasadam while water distribution by Additional Health Officer Dr Sunil at Vontimitta. 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీ కోదండరామస్వామి బ్ర‌హ్మోత్స‌వాల‌లో భక్తులకు రుచిక‌ర‌మైన‌ అన్నప్రసాదాలు

– నిరంతరాయంగా తాగునీరు, మ‌జ్జిగ‌ ఏర్పాటు

ఒంటిమిట్ట‌, 2024 ఏప్రిల్ 17: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు విశేషంగా విచ్చేసే వేలాది మంది భక్తులకు నిరంతరాయంగా రుచిక‌ర‌మైన‌ అన్నప్రసాదాలను టీటీడీ అందిస్తోంది.

స్వామివారి ద‌ర్శ‌నానికి వ‌చ్చే భక్తులకు నిరంతరాయంగా తాగునీరు, మ‌జ్జిగ అందిస్తున్నారు. ఆల‌య ప్రాంగ‌ణంలో ఎండ వేడిమి నుండి భ‌క్తుల‌కు ఇబ్బంది లేకుండా జ‌ర్మ‌న్ షెడ్లు, కూల‌ర్లు ఏర్పాటు చేశారు. ఇందులో ప్ర‌తి రోజు ఉద‌యం 7 గంట‌ల‌కు అల్పాహారం, ఉద‌యం 10.30 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మ‌ర‌ల సాయంత్రం 6.30 నుండి రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు రుచిక‌ర‌మైన అన్నం, సాంబ‌రు, ర‌సం, మ‌జ్జిగ‌, ప‌చ్చ‌డి, క‌ర్రీ, బెల్లం పొంగ‌లి అందిస్తారు

ఇందుకోసం దాదాపు 50 మంది టీటీడీ అన్న‌ప్ర‌సాదం విభాగం సిబ్బంది ప‌నిచేస్తున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.