ANNUAL BRAHMOTSAVAMS COMMENCES IN TONDAMANADU _ తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

TIRUPATI, 01 MARCH 2022: The annual brahmotsavams in Sridevi Bhudevi Sametha Sri Venkateswara Swamy temple in Tondamanadu commenced on a religious note in Ekantam due to Covid restrictions with Dhwajarohanam on Monday.

Pushpa Yagam will be observed on March 10. The important days includes Garuda Vahanam on March 5, Chakrasnanam on March 9.

Temple AEO Sri Satre Naik and others were present during Dhwajarohanam.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

తొండమనాడులోని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
 
 తిరుపతి, 2022 మార్చి 01: టిటిడికి అనుబంధంగా ఉన్ళ తొండమనాడులోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా వాహనసేవలు నిర్వహిస్తున్నారు. మార్చి 10వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. మొదటి రోజు సాయంత్రం శేష వాహన సేవ ఆస్థానం జరిగింది.
 
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 2న హంస వాహనం, మార్చి 3న సింహవాహనం, మార్చి 4న హనుమంత వాహనం, మార్చి 5న గరుడవాహనం, మార్చి 6న గజవాహనం, మార్చి 7న చంద్రప్రభవాహనం, మార్చి 8న అశ్వవాహనం, మార్చి 9న చక్రస్నానం, ధ్వజావరోహణం, మార్చి 10న పుష్పయాగం జరగనున్నాయి.
 
ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ సుబ్రమణ్యం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.