ANNUAL BRAHMOTSAVAMS IN TONDAMANPURAM _ మార్చి 9 నుండి 17వ తేదీ వరకు తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
TIRUPATI, 19 FEBRUARY 2024: The Annual Brahmotsavam of Sridevi Bhudevi Sameta Sri Prasanna Venkateswara Swamy temple in Tondamanpuram will be held from March 9 to 17 with Ankurarpanam on March 8 at 6 pm.
Brahmotsavam starts with ceremonial Garuda flag hoisting on March 9 between 7 am and 8 am.
Every day Vahana Sevas are being observed between 7pm and 8.30 pm. Hansa Vahanam on March 10, Simha Vahanam on March 11, Hanumanta Vahanam on March 12, Kalyanotsavam in the evening on March 13, Garuda Seva at the same day night, Gajavahanam on March 14, Chandraprabha Vahanam on March 15, Trichy in the morning on March 16th and Asva Vahanam at the night. Chakra Snanam and Dhwajavarohanam will be on March 17 and Pushpayagam on March 18.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
మార్చి 9 నుండి 17వ తేదీ వరకు తొండమాన్‌పురం శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 19 ఫిబ్రవరి 2024: తొండమాన్‌పురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 9 నుండి 17వ తేదీ వరకు జరుగనున్నాయి. మార్చి 8న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు.
మార్చి 9న ఉదయం 7 నుండి 8 గంటల మధ్య ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. రాత్రి శేష వాహన సేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు. మార్చి 10న హంస వాహనం, మార్చి 11న సింహ వాహనం, మార్చి 12న హనుమంత వాహనం, మార్చి 13న సాయంత్రం కల్యాణోత్సవం, రాత్రి గరుడ సేవ, మార్చి 14న గజవాహనం, మార్చి 15న చంద్రప్రభ వాహనం, మార్చి 16న ఉదయం తిరుచ్చి, రాత్రి ఆశ్వ వాహన సేవలు నిర్వహిస్తారు.
మార్చి 17న ఉదయం 9 నుంచి 11 గంటల వరకు చక్రస్నానం, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ధ్వజావరోహణం నిర్వహిస్తారు. మార్చి 18న సాయంత్రం 5.30 గంటలకు పుష్పయాగం జరగనుంది.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.