ANNUAL BRAHMOTSAVAMS KICK STARTS WITH PEDDA SHESHA VAHANAM_ పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు

Tirumala, 30 Sep. 19: On the first day evening of the ongoing annual Brahmotsavams of Sri Venkateswara Swamy at Tirumala,  Sri Malayappa Swamy took a celestial ride on Pedda Sesha Vahanam on Monday evening.

The first vahana seva of the 16 celestial carrier processions of Brahmotsavam-2019, the Serpent Carrier Seva commenced amidst a grand fanfare of hundreds of artisans from all over the country presenting bhajans, kolatas while folk dancers presenting mythological themes to enthrall the devotees who thronged the four Mada streets.


The utsava idols of Malayappa Swamy flanked on either side by His two divine consorts Sridevi and Bhudevi mounted atop the golden Pedda Sesha Vahanam blessed devotees.  

The Pedda shesha vahanam is symbolic with Dhyana Bhakti. The darshan of Lord on this seven hooded serpent king vahanam is seen as a blessing for all devotees and shower of good fortunes, prosperity and good health.   

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs.TIRUPATI

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

పెద్ద‌శేష వాహ‌న‌సేవ‌లో పాల్గొన్న రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు

సెప్టెంబర్ 30, తిరుమ‌ల‌ 2019: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజైన సోమ‌వారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణశేషవాహనంపై(పెద్ద శేషవాహనం) తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ వాహ‌న‌సేవ‌లో పాల్గొన్నారు.

 ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు. ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు. రామావతారంలో లక్ష్మణుడుగా, ద్వాపరంలో బలరాముడుగా శ్రీమన్నారాయణుడికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు. ఈయన శ్రీభూదేవి సహితుడైన శ్రీవేంకటేశ్వరుని వహిస్తూ తొలిరోజు భక్తులకు దర్శనమిచ్చారు. మంగ‌ళ‌వారం ఉదయం చిన్నశేష వాహనం, రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ నారాయ‌ణ‌స్వామి, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ప్ర‌త్యేక ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.