CM OFFERS SILK VASTRAMS TO SRI VENKATESWARA SWAMY_ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

Tirumala, 30 Sep. 19: The Honourable CM of Andhra Pradesh Sri  Y S Jaganmohan Reddy offered silk vastrams to Sri Venkateswara Swamy on behalf of State Government, as a part of the official tradition, to make such an offering during the annual Brahmotsavams at Tirumala.

Earlier the Chief Minister was adorned with traditional headgear by temple archaka at Sri Bedi Anjaneya Swamy temple. From there he carried the silk vastrams in a plate over his head amidst the chanting of Veda mantras with the accompaniment of Nadaswaram and Melam to the main temple. 

Later he offered silk vastrams to the presiding deity in side temple and offered prayers to Sri Venkateswara Swamy. At Ranganayakula Mandapam he was rendered Vedasirvachanam by temple priests. 

CM OFFERS TULABHARAM

The CM later offered 80kilos 400grams of rice as Tulabhram and fulfilled his wish and also took part in Peddasesha Vahanam procession.

TTD Chairman Sri YV Subba Reddy, EO Sri Anil Kumar Singhal, Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, District Collector Sri Narayana Bharat Gupta, Tirupati Urban SP Sri Anburajan and other officers were also present.

Apart from the officers, the other important persons who were present included MPs Sri Mithun Reddy, Sri Reddeppa, Minister DyCM Sri Narayana Swamy, Sri P Ramachandra Reddy, Local MLA Sri B Karunakar Reddy, TTD Trust Board members, special invitees and others were also present. 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI 

2019 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి

సెప్టెంబర్ 30, తిరుమ‌ల‌ 2019: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలలో తొలిరోజైన సోమ‌వారం రాత్రి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌ|| శ్రీ వైఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవేంకటేశ్వరస్వామివారికి పట్టువస్రాలు సమర్పించారు.

ముందుగా గౌ|| ముఖ్యమంత్రి శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అక్కడినుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో శ్రీ పి.బ‌సంత్‌కుమార్‌ కలిసి స్వాగతం పలికారు. ఆ తరువాత గౌ|| ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదమంత్రోచ్ఛారణతో వేద పండితులు ఆశీర్వదించారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఆ త‌రువాత గౌ|| ముఖ్యమంత్రివ‌ర్యులు త‌న బ‌రువుకు స‌మానంగా 80 కిలోల బియ్యంతో తులాభారం మొక్కు స‌మ‌ర్పించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి శ్రీ నారాయ‌ణ‌స్వామి, మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, తిరుప‌తి ఎమ్మెల్యే శ్రీ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి, ప‌లువురు ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు, ప్ర‌త్యేక ఆహ్వానితులు, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ భ‌ర‌త్ గుప్తా, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి, అర్బ‌న్ ఎస్పీ శ్రీ అన్బురాజ‌న్ తదితరులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.