ANNUAL BRAHMOTSAVAMS OF SRI KONETIRAYASWAMY AT KEELAPATLA _ మే 16 నుండి 24వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 05 May 2024: Annual Brahmotsavam of Sri Konetiraya Swamy in Keelapatla, Chittoor district from 16th May.
 
It will be held grandly till 24th.  
 
Brahmotsavam starts with Koil Alwar Thirumanjanam on May 14 and Senadhipati Utsavam and Ankurarpanam on May 15 from 6 pm to 8.30 pm.
 
Vahana sevas are available from 8 am to 10 am and from 7 pm to 9 pm.
 
Important days includes Kalyanotsavam, Garuda Vahanam on May 21, Vasantotsavam,  on May 22, Rathotsavam on May 23, Chakra Snanam on May 24
 
Devotees participating in Kalyanotsavam have to pay Rs.500/-per ticket on which two persons will be allowed.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

మే 16 నుండి 24వ తేదీ వరకు కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 మే 05: చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. మే 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మే 15న సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటలవరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రాంభమవుతాయి.

రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి.

వాహనసేవల వివరాలు ఇలా ఉన్నాయి.

తేదీ

16-05-2024

ఉదయం – ధ్వజారోహణం(మిథున‌ లగ్నం)

సాయంత్రం – శేష వాహనం

17-05-2024

ఉదయం – తిరుచ్చిఉత్సవం

సాయంత్రం – హంస వాహనం

18-05-2024

ఉదయం – సింహ వాహనం

సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం

19-05-2024

ఉదయం – కల్పవృక్ష వాహనం

సాయంత్రం – సర్వభూపాల వాహనం

20-05-2024

ఉదయం – మోహినీ ఉత్సవం

సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం

21-05-2024

ఉదయం – హనుమంత వాహనం

సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం

22-05-2024

ఉదయం – సూర్యప్రభ వాహనం

సాయంత్రం – చంద్రప్రభ వాహనం

23-05-2024

ఉదయం – రథోత్సవం

సాయంత్రం – అశ్వవాహనం

24-05-2024

ఉదయం – చక్రస్నానం

సాయంత్రం – ధ్వజావరోహణం

ఉత్సవాల్లో భాగంగా మే 20వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 25వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక‌, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.