ONE – DAY ANNAPRASADAM DONATION @ RS. 38 LAKHS _ రూ.38 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం

DONORS CAN SERVE THEMSELVES

Tirumala, 05 May 2024: The devotees not only can donate but also render Annaprasadam services to the pilgrims in Tirumala under one-day donation to SV Annaprasadam.

Details of donation amounts for Annaprasada distribution

One day Annaprasadam – Rs.38 lakhs, Breakfast – Rs.8 lakhs, Lunch – Rs.15 lakhs Dinner – Rs.15 lakhs.

The donor’s name is displayed in the Vengamamba Annaprasadam Complex.  

Likewise, donors can get an opportunity to serve Annaprasadam here one day on the date as per their choice.

Places in Tirumala and Tirupati where Annaprasadam is being served

Matrusri Tarigonda Vengamamba Annaprasada Complex in Tirumala, Compartments in Vaikuntham Q Complex-1, 2, Outer Qlines, PAC-4 (Old Annaprasada), PAC-2, Rs.300 Darshan line, Physically Challenged and senior citizens line, food counters.

Sri Govindaraja Swamy Temple in Tirupati, Srinivasam, Vishnunivasam Complexes, Ruia Hospital, SVIMS, Maternity Hospital,  BIRRD, SV Ayurveda Hospital, Annaprasadam building in Tiruchanoor.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రూ.38 లక్షల విరాళంతో ఒకరోజు అన్నప్రసాద వితరణకు అవకాశం

– దాతలు స్వయంగా వడ్డించవచ్చు

– దాతల పేరు ప్రదర్శన

తిరుమల, 2024 మే 05: తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించిన విష‌యం విధిత‌మే.

ప్ర‌స్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల‌ వివ‌రాలు :

ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ – రూ.38 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం – రూ.8 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం – రూ.15 లక్షలు, రాత్రి భోజనం కోసం – రూ.15 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు.

విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు.

తిరుమల, తిరుప‌తిల‌లో ప్రస్తుతం అన్నప్రసాదాలు విత‌ర‌ణ చేస్తున్న‌ ప్రాంతాలు

ప్రస్తుతం తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్, వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1, 2లోని కంపార్ట్‌మెంట్లు, బయటి క్యూలైన్‌లు, పీఏసీ-4(పాత అన్నప్రసాదం ), పీఏసీ-2, తిరుపతిలోని శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీనివాసం, విష్ణునివాసం కాంప్లెక్సులు, రుయా ఆసుపత్రి, స్విమ్స్, మెటర్నిటీ ఆస్పత్రి, బర్డ్, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, తిరుచానూరులోని అన్నప్రసాద భవనంలో భక్తులకు ఉచితంగా అన్నప్రసాద వితరణ జరుగుతోంది.

తిరుమలలోని ఫుడ్ కౌంటర్లలో అన్నప్రసాదాలు అందిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్-1, 2లోని కంపార్ట్‌మెంట్లు, వృద్ధులు, దివ్యాంగులు వేచి ఉండే కాంప్లెక్స్, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన కాంప్లెక్స్, ప్రధాన కల్యాణకట్టలో టీ, కాఫీ, చంటిపిల్లలకు పాలు అందిస్తున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.