PAVITRA SAMARPAN HELD _ శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

TIRUPATI, 11 JULY 2022: On the second day of the annual Pavitrotsavams, Pavitra Samarpana was held in Sri Kapileswara Swamy temple on Monday.

Deputy EO Sri Devendrababu, AEO Sr Srinivasulu, Superintendent Sri Bhupati, Temple Inspector Sri Reddi Sekhar and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ కపిలేశ్వరాలయంలో వేడుక‌గా ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ‌

తిరుపతి, 2022 జులై 11: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జ‌రుగుతున్న పవిత్రోత్సవాల్లో రెండో రోజైన సోమ‌వారం వేడుక‌గా గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ జ‌రిగింది.

ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు యాగ‌శాల పూజ‌, హోమం, ల‌ఘు పూర్ణాహుతి, గ్రంథి ప‌విత్ర స‌మ‌ర్ప‌ణ చేప‌ట్టారు. ‌సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు యాగ‌శాల‌పూజ‌, హోమం, ప‌ట్టు ప‌విత్ర ప్ర‌తిష్ఠ కార్యక్రమాలు నిర్వ‌హిస్తారు.

ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ దేవేంద్ర‌బాబు, ఏఈఓ శ్రీ శ్రీ‌నివాసులు, సూప‌రింటెండెంట్ శ్రీ భూప‌తి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు శ్రీ రెడ్డిశేఖ‌ర్‌, శ్రీ శ్రీనివాస నాయక్ తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.