ANNUAL FETE AT UPAMAKA FROM SEP 27- OCT 5 _ సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
Tirupati, 25 September 2022:TTD is organising annual Brahmotsavams at the TTD sub-temple of Sri Venkateswara at Upamaka, Nakkapalli Mandal, Anakapalli district between September 27 and October 5 with Ankurarpanam on September 26.
Following are schedule of vahana sevas of Brahmotsavam.
September 27: Dwajarohanam and Sesha Talpa vahana at night.
September 28: Rajadhiraja vahana and Hamsa vahana at night.
September 29: Ittadi Sapparam vahana and Pedda Pallaki vahana
September 30: Anjaneya vahana and Lakka Garuda Vahana.
October 1: Sapparam vahana and Rajadhiraja vahana
October 2: Vasantothsavam and Ittadi Garuda Vahana.
October 3: Rathotsavam, Punyakoti vahana at night.
October 4: Mrugaveta and Gaja vahana at night
October 5: Purnahuti and Chakra snanam and Dwajavarohanam at night.
Similarly special abhisekam daily performed to Mula Virat at Garudadri Konda during Brahmotsavam period.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు ఉపమాక శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2022 సెప్టెంబరు 25: టిటిడికి అనుబంధంగా ఉన్న అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం, ఉపమాకలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబరు 26వ తేదీన ఉదయం 9.08 గంటలకు తిరువీధిలో బ్రహ్మోత్సవ కావిడితో ఈ ఉత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. రాత్రి అశ్వవాహనం, అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
– సెప్టెంబరు 27న ఉదయం ధ్వజారోహణం, రాత్రి శేషతల్ప వాహనం.
– సెప్టెంబరు 28న ఉదయం రాజధిరాజ వాహనం, రాత్రి హంస వాహనం.
– సెప్టెంబరు 29న ఉదయం ఇత్తడి సప్పరం, రాత్రి పెద్ద పల్లకీ ఉత్సవం.
– సెప్టెంబరు 30న ఉదయం ఆంజనేయ వాహనం, రాత్రి లక్క గరుడ వాహనం.
– అక్టోబరు 1న ఉదయం సప్పరం వాహనం, రాత్రి రాజాధిరాజ వాహనం.
– అక్టోబరు 2న ఉదయం వసంతోత్సవం, రాత్రి ఇత్తడి గరుడ వాహనం.
– అక్టోబరు 3న ఉదయం రథోత్సవం, రాత్రి పుణ్యకోటి వాహనం.
– అక్టోబరు 4న ఉదయం మృగవేట, రాత్రి గజ వాహనం.
– అక్టోబరు 5న ఉదయం పూర్ణాహుతి, చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం.
అదేవిధంగా, సెప్టెంబరు 26 నుండి అక్టోబరు 5వ తేదీ వరకు గరుడాద్రి పర్వతం(కొండ)పై మూలవిరాట్‌స్వామివారికి నిత్య,, ప్రత్యేక అభిషేకాలు తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.