ANNUAL FETE OF CHANDRAGIRI RAMALAYAM FROM APRIL 17 TO 25 _ ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

Tirupati, 21 March 2024: The annual Brahmotsavam of Chandragiri Sri Kodandarama Swamy

will be celebrated from April 17 to 25 with Ankurarpanam on April 16.

As part of this, a Dwajarohanam will be on April 17 between 9.05 am to 10 am in Vrishabha Lagnam.  From 6.30 pm to 7.30 pm Sri Kodanda Ramaswamy will give darshan to the devotees on the Hanumanta Vahanam.

Kalyanotsavam of Sri Sitarama will be held on 23rd April from 10 am to 11.30 am.

By paying Rs.750/- per ticket Grihastas(two persons on a ticket) can participate in Kalyanotsavam.

From 6.30 pm to 7.30 pm, Swami will ride on the Garuda Vahanam.

On April 25 from 9 am to 10.30 am, Snapana Tirumanjanam will be held to the Utsava Murthies and Chakratthalwar will be given Chakra Snanam between 10.30 am and 11 am.

Brahmotsavam will conclude with Dhwajavarohanam on the same day at 6:30pm.

Sri Ramapattabhishekam will be held in a grand style on April 26th from 9 am to 10.15 am.

On this occasion, Harikathas, Bhajans and devotional music concerts will be organized under the auspices of TTD Hindu Dharma Prachara Parishad, Dasa Sahitya Project and Annamacharya Project.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2024 మార్చి 21: చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 17 నుండి 25వ తేదీ వ‌ర‌కు వైభ‌వంగా జ‌రుగ‌నున్నాయి. ఏప్రిల్ 16వ తేదీ సాయంత్రం అంకురార్ప‌ణ‌తో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌వుతాయి.

ఇందులో భాగంగా ఏప్రిల్ 17వ తేదీ ఉద‌యం 9.05 నుండి 10 గంట‌ల మ‌ధ్య వృష‌భ‌ ల‌గ్నంలో ధ్వజారోహణం నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు శ్రీ కోదండ రామస్వామివారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

ఏప్రిల్ 23వ తేదీ ఉద‌యం 10 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు శ్రీసీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు.
రూ.750/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు.

సాయంత్రం 6.30 నుండి రాత్రి 7.30 గంటల వరకు గరుడ వాహనంపై స్వామివారు ఉరేగుతూ భక్తులను కటాక్షించనున్నారు.

ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 9 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల ఉత్స‌ర్ల‌కు, చక్రత్తాళ్వార్‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం, ఉద‌యం 10.30 నుండి 11 గంటల వ‌ర‌కు చక్రస్నానం వైభవంగా నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ధ్వజావరోహణముతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.

ఏప్రిల్ 26వ తేదీ ఉద‌యం 9 నుండి 10.15 గంటల వరకు శ్రీ రామపట్టభిషేకం వైభవంగా నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, సంగీత కచేరీలు నిర్వహించనున్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.