TEPPOTSAVAMS ENTERS DAY 2 _ తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

Tirumala, 21 March 2024: The annual Teppotsavams commenced on a grand celestial note with Sri Krishna Swamy along with Rukmini taking a pleasure ride for three rounds on the finely decked float in the Swamy Pushkarini waters on Thursday.

TTD cancelled Sahasra Deepalankara Seva in connection with the float festival.

TTD EO Sri AV Dharma Reddy, SE 2 Sri Jagadeeshwar Reddy, CPRO Dr T Ravi, temple DyEO Sri Lokanatham and other officials, devotees participated.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

తెప్పపై రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారి అభయం

తిరుమల, 2024 మార్చి 21: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజు గురువారం రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణస్వామివారు తెప్పలపై భక్తులకు అభయమిచ్చారు.

ముందుగా స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించి శ్రీవారి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు విద్యుద్దీపాలతో అందంగా అలంకరించిన తెప్పపై స్వామివారు ఆశీనులై పుష్కరిణిలో ముమ్మార్లు విహరిస్తూ భ‌క్తుల‌ను క‌టాక్షించారు. వేదం, గానం, నాదం మ‌ధ్య తెప్పోత్స‌వం వేడుక‌గా జ‌రిగింది.

కాగా, మూడవరోజు శ్రీభూ సమేతంగా మలయప్పస్వామివారు తిరుచ్చిపై సర్వాలంకార భూషితుడై పురవీధుల్లో ఊరేగిన అనంతరం కోనేటిలోని తెప్పపై ఆశీనుడై ముమ్మార్లు విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి.రవి, శ్రీ‌వారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోక‌నాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.