ANNUAL FETE OF DEVUNI KADAPA TEMPLE FROM FEB 10-18 _ ఫిబ్రవరి 10 నుండి 18వ తేదీ వరకుదేవుని కడపశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
Tirupati, 18 January 2024: TTD is organizing the annual Brahmotsavam of Sri Lakshmi Venkateswara temple, Devuni Kadapa from February 10-18 with Ankurarpanam on February 9.
However, the prestigious Kalyanotsavam will be held on February 15 morning in which the devotees couple could participate with ₹300 tickets and the annual Pushpayagam will be performed on February 19 evening.
The Artists of the Annamacharya Project and HDPP will daily perform Harikatha, Bhakti Sangeet, discourses, and sankeertans.
HIGHLIGHTS OF THE ANNUAL BRAHMOTSAVAM CELEBRATIONS AS BELOW.
10-02-2024 Dwajarohanam and Chandra Prabha Vahanam
11-02-2024 Surya Prabha Vahanam and Pedda Sesha Vahanam
12-02-2024 Chinna Sesha Vahanam and Simha Vahanam
13-02-2024 Kalpavruksha Vahanam & Hanumanta Vahanam
14-02-2024 Muthyala pandiri Vahanam & Garuda Vahanam
15-02-2024 Kalyanotsavam and Gaja Vahanam
16-02-2024 Rathotsavam and Dhooli Utsavam
17-02-2024 Sarva bhupala Vahanam and Aswa Vahanam
18-02-2024 Vasanthotsavam and Chakra Snanam / Hamsa Vahana and Dwajaavarohanam
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఫిబ్రవరి 10 నుండి 18వ తేదీ వరకుదేవుని కడపశ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి, 2024 జనవరి 18 ;వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడపలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 10 నుండి 18వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
కాగా, ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
10-02-2024 ఉదయం – ధ్వజారోహణం రాత్రి – చంద్రప్రభ వాహనం
11-02-2024 ఉదయం – సూర్యప్రభవాహనం రాత్రి – పెద్దశేష వాహనం
12-02-2024 ఉదయం – చిన్నశేష వాహనం రాత్రి – సింహ వాహనం
13-02-2024 ఉదయం – కల్పవృక్ష వాహనం రాత్రి – హనుమంత వాహనం
14-02-2024 ఉదయం – ముత్యపుపందిరి వాహనం రాత్రి – గరుడ వాహనం
15-02-2024 ఉదయం – కల్యాణోత్సవం రాత్రి – గజవాహనం
16-02-2024 ఉదయం – రథోత్సవం రాత్రి – ధూళి ఉత్సవం
17-02-2024 ఉదయం – సర్వభూపాల వాహనం రాత్రి – అశ్వ వాహనం
18-02-2024 ఉదయం – వసంతోత్సవం, చక్రస్నానం రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.