ANNUAL FETE OF JUBILEE HILLS VENKATESWARA SWAMY _ ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు 

TIRUPATI, 10 FEBRUARY 2023: The annual brahmotsavams in Sri Venkateswara Swamy temple at Jubilee Hills in Hyderabad will be observed between February 20 and 28 with the Ankurarpanam  fete for the mega festival on February 19.

The important days include Dhwajarohanam on February 20, Garuda Seva on February 24, Rathotsavam on February 27, Chakra Snanam on February 28. On March 1, Pushpayagam will be observed.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు జూబ్లీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 2023 ఫిబ్రవరి 10: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో గల టిటిడికి చెందిన శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకోసం ఫిబ్రవరి 19న అంకురార్పణ నిర్వహిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 20న ధ్వజారోహణం, ఫిబ్రవరి 24న గరుడసేవ, ఫిబ్రవరి 27న రథోత్సవం, ఫిబ్రవరి 28న చక్రస్నానం, మార్చి 1న పుష్పయాగం నిర్వహిస్తారు.

ఉదయం 8 నుండి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.