ANNUAL SPORTS MEET CONCLUDES _ ముగిసిన టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
Tirupati, 22 February 2022: The annual sports meet of TTD concluded with series of events conducted for its employees on Tuesday.
In SV Junior College Grounds, sports including Javelin throw, running race, walkathon, ball throw etc. Were conducted to men employees of various age categories.
On the other hand Hitting the Indian Club, Ball Throw, Bucketing the Ball, Lemon on Spoon, Shot put were also conducted apart from running race and walkathon conducted to women of various age categories.
Employees participated with enthusiasm braving the hot Sun.
Later in the evening Swimming was also conducted completing the competitions.
The prizes (gift cards) will be distributed to all the winners and runners during the valedictory program to be held on February 25 at Mahati Auditorium by 6pm onwards.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
ముగిసిన టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు
తిరుపతి, 2022 ఫిబ్రవరి 22: టిటిడి ఉద్యోగుల క్రీడాపోటీలు మంగళవారం ముగిశాయి. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ పోటీలు జరిగాయి.
టిటిడి పురుష ఉద్యోగులకు వివిధ కేటగిరీల వారీగా జావెలిన్ త్రో, పరుగు పందెం, నడక పోటీ, బాల్ త్రో తదితర పోటీలు నిర్వహించారు.
మహిళా ఉద్యోగులకు పరుగు పందెం, నడక పోటీలతో పాటు హిట్టింగ్ ది ఇండియన్ క్లబ్, బాల్ త్రో, లెమన్ స్పూన్, బకెటింగ్ ది బాల్, షాట్ పుట్ తదితర పోటీలు నిర్వహించారు.
సాయంత్రం ఈత పోటీలతో ఈ పోటీలు ముగిశాయి. టిటిడి ఉద్యోగులు ఉత్సాహవంతంగా ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి 25వ తేదీన సాయంత్రం 6 గంటలకు మహతి ఆడిటోరియంలో జరుగనున్న కార్యక్రమంలో ఈ పోటీల్లో గెలుపొందిన ఉద్యోగులకు బహుమతులు ప్రదానం చేస్తారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.